logo

ప్రైవేటు బస్సులకు రాసిచ్చేశారా?!

ప్రజల రాకపోకలు, వాహనాలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు రహదారులు నిర్మిస్తారు. కానీ ప్రైవేటు బస్సులు చూడండి హనుమాన్‌పేట జి.ఎస్‌.రాజు రోడ్డు,

Published : 29 Jun 2024 04:38 IST

 జి.ఎస్‌.రాజు రోడ్డుకి ఇరువైపులా నిలిపిన ప్రైవేటు బస్సులు 

ప్రజల రాకపోకలు, వాహనాలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు రహదారులు నిర్మిస్తారు. కానీ ప్రైవేటు బస్సులు చూడండి హనుమాన్‌పేట జి.ఎస్‌.రాజు రోడ్డు, పాతప్రభుత్వాసుపత్రి సమీపంలో రహదారులను ఆక్రమించి దారిపొడవునా పదుల సంఖ్యలో బస్సులు ఆపి ఉంచుతున్నారు. అక్కడే వాటిని కడగడంతో రాకపోకలు సాగించే ప్రజలకు ట్రాఫిక్‌ ఇక్కట్లు తెచ్చిపెడుతోంది. ప్రైవేటు స్థలాలు అద్దెకు తీసుకుని పార్కింగ్‌ చేయడం ఎందుకని.. ఏకంగా రహదారిని ఆక్రమించేసినా ట్రాఫిక్‌ పోలీసులు చూసీచూడనట్లు ‘మామూలు’గా వదిలేస్తున్నారు. కానీ ఈ రహదారి పక్కనే ఉన్న కేదారేశ్వరపేట రైతుబజారు ముందు ద్విచక్ర వాహనాలు నిలిపి కూరగాయలు తక్కువ ధరకు వస్తాయని వచ్చే సామాన్యుల వాహనాలను గీతదాటి ముందుకు వచ్చాయని ఫొటోలు తీసి చలానాలు రోజూ వేసే ట్రాఫిక్‌ పోలీసులకు మరి ఈ ప్రైవేటు బస్సులు కనపడకపోవడం విడ్డూరమే.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని