logo

ఎమ్మెల్యే చొరవ.. కేజీబీవీలో సమస్యల పరిష్కారం

ఎ.కొండూరులోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయంలోని దీర్ఘకాలిక సమస్యలు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు చొరవతో పరిష్కారమయ్యాయి.

Published : 29 Jun 2024 04:24 IST

విద్యాలయం వెలుపల ఏర్పాటు చేసిన విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ 

ఎ.కొండూరు, న్యూస్‌టుడే: ఎ.కొండూరులోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయంలోని దీర్ఘకాలిక సమస్యలు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు చొరవతో పరిష్కారమయ్యాయి. కేజీబీవీలో బాలికలకు ఈనెల 22న ఆయన విద్యా కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయంలో సమస్యలపై ఎమ్మెల్యే ఆరాతీయగా ప్రాంగణంలో ప్రమాదకర పరిస్థితిలో ట్రాన్స్‌ఫార్మర్, అతి పెద్ద గుంత ఉన్నాయని ప్రిన్సిపల్‌ ఎస్‌కే.మీరున్నీసాబేగం చెప్పారు. స్పందించిన ఎమ్మెల్యే ట్రాన్స్‌ఫార్మర్‌ తొలగించాలని విద్యుత్తు శాఖ అధికారులకు, గుంతను మట్టితో పూడ్పించాలని స్థానిక అధికారులకు సూచించారు. దీంతో విద్యుత్తు శాఖ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్‌ ప్రహరీ వెలుపల స్తంభానికి అమర్చారు. స్థానికులు ట్రాక్టర్లతో మట్టిని తరలించి గుంతను పూడ్చించారు. గురువారం కేజీబీవీని సందర్శించిన ఎమ్మెల్యే తానిచ్చిన రెండు హామీలు నెరవేర్చినట్లు తెలిపారు. కేజీబీవీలో మైదానం చదునుకు అవసరమైతే ఇంకా మట్టి పోయిస్తామని తెలిపారు. విద్యాలయంలో దీర్ఘకాలిక సమస్యలను సత్వరమే పరిష్కరించిన ఎమ్మెల్యేకు ప్రిన్సిపల్, ఉపాధ్యాయినులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని