logo

Actor Prudhvi: నటుడు పృథ్వీపై వరకట్న వేధింపుల కేసు కొట్టివేత

సినీ నటుడు పృథ్వీరాజ్‌పై నమోదైన వరకట్న వేధింపుల కేసును కొట్టివేస్తూ బుధవారం విజయవాడ కోర్టు తీర్పు వెలువరించింది.

Updated : 27 Jun 2024 08:55 IST

కోర్టుకు హాజరైన నటుడు పృథ్వీరాజ్‌

ఈనాడు, అమరావతి: సినీ నటుడు పృథ్వీరాజ్‌పై నమోదైన వరకట్న వేధింపుల కేసును కొట్టివేస్తూ బుధవారం విజయవాడ కోర్టు తీర్పు వెలువరించింది. అదనపు కట్నం కోసం తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని పృథ్వీ భార్య శ్రీలక్ష్మి ఫిర్యాదుపై నగరంలోని సూర్యారావుపేట స్టేషన్‌లో 2016లో సెక్షన్‌ 498ఏ కింద వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. వివాహం సందర్భంగా డబ్బు, బంగారు నగలు ఇచ్చినా.. ఇంకా అదనపు కట్నం తీసుకురావాలని నిత్యం వేధించేవారని ఆమె పేర్కొన్నారు. సినిమాల్లో నటించేందుకు హైదరాబాద్‌ వెళ్లిన తర్వాత, వ్యసనాలకు బానిసై తనను నిర్లక్ష్యం చేశారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు.. 2017లో నగరంలోని రెండో ఏసీఎంఎం (అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌)లో ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. దీనిపై అప్పటి నుంచి వాదనలు జరుగుతున్నాయి. కేసుపై తుది తీర్పును న్యాయాధికారి మాధవీదేవి బుధవారం వెలువరించారు. విచారణలో నిందితుడిపై నేరారోపణలు రుజువు కాకపోవడంతో కేసును కొట్టేస్తూ న్యాయాధికారి తీర్పు ఇచ్చారు. నటుడు పృథ్వీ బుధవారం రెండో ఏసీఎంఎం కోర్టుకు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని