logo

Ramoji rao: తరలివచ్చిన పెదపారుపూడి.. ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాట్లు

తమ ఊరి బిడ్డ.. తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తిగా ఎదిగిన రామోజీరావుకు నివాళులర్పించేందుకు పెదపారుపూడి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ గ్రామం నుంచి 400 మంది వరకు 8 బస్సుల్లో సంస్మరణ సభకు హాజరయ్యారు.

Updated : 28 Jun 2024 08:09 IST

రామోజీరావుతో అనుబంధాన్ని స్మరించుకుని ఉద్వేగం

బస్సుల్లో వచ్చిన పెదపారుపూడి గ్రామస్థులు 

తమ ఊరి బిడ్డ.. తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తిగా ఎదిగిన రామోజీరావుకు నివాళులర్పించేందుకు పెదపారుపూడి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ గ్రామం నుంచి 400 మంది వరకు 8 బస్సుల్లో సంస్మరణ సభకు హాజరయ్యారు. తమ గ్రామానికి చేసిన అభివృద్ధిని గుర్తుచేసుకున్నారు. పెదపారుపూడి గ్రామస్థులకు ప్రభుత్వం సముచిత గౌరవం ఇచ్చింది. ఒక జిల్లా అధికారిని నియమించి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసింది. కృష్ణా జిల్లా వివిధ ప్రాంతాల నుంచి వేల మంది తరలివచ్చారు. విజయవాడ నుంచి భారీగా హాజరయ్యారు. పోలీసులు ట్రాఫిక్‌ నియంత్రణకు గట్టి చర్యలు తీసుకున్నారు. మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, సత్యకుమార్‌యాదవ్, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు.., ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో హాజరై రామోజీరావుకు నివాళులర్పించారు. సీఆర్‌డీఏ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, కృష్ణా కలెక్టర్‌ డీకే బాలాజీ, సంయుక్త కలెక్టర్లు సంపత్‌కుమార్, గీతాంజలి శర్మ, విజయవాడ సీపీ రామకృష్ణ, కృష్ణా ఎస్పీ నయీం అస్మి ఇతర అధికారులు  సమన్వయంతో వ్యవహరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని