logo

రంగులు మార్చే సీతాకోకచిలుక

సీతాకోకచిలుక.. దీని పేరు చెబితేనే అనేక ఆకట్టుకునే రంగులు గుర్తుకొస్తాయి. గొంగళి పురుగుగా ఉన్నప్పుడు ఒళ్లు జలదరించే స్థితి నుంచి అందంతో అందరినీ ఆకట్టుకునేలా తనని తాను తీర్చిదిద్దుకుంటుంది.

Published : 04 Jul 2024 01:30 IST

చింతపల్లి, న్యూస్‌టుడే: సీతాకోకచిలుక.. దీని పేరు చెబితేనే అనేక ఆకట్టుకునే రంగులు గుర్తుకొస్తాయి. గొంగళి పురుగుగా ఉన్నప్పుడు ఒళ్లు జలదరించే స్థితి నుంచి అందంతో అందరినీ ఆకట్టుకునేలా తనని తాను తీర్చిదిద్దుకుంటుంది. శత్రువుల బారి నుంచి రక్షించుకునే క్రమంలో ఇది పరిస్థితులకు అనుగుణంగా వర్ణాలు మార్చుకుంటుంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న సీతాకోకచిలుక అక్కడి గోడపై ఉన్న రంగులో కలిసిపోయింది. సీతాకోకచిలుకలు పరిస్థితులకు అనుగుణంగా తన బాహ్య రూపాన్ని మార్చుకోగల స్వభావాన్ని కలిగి ఉంటాయని కీటక విభాగం శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.


సీలేరులో అరుదైన చేప

సీలేరు, న్యూస్‌టుడే: సీలేరు నదిలో బుధవారం గెలస్కోపీ అనే అరుదైన చేప దొరికింది. సుమారు 11 కేజీల బరువున్న దీనిని స్థానికుడు వనములు నర్సింగ్‌ విక్రయించడానికి మార్కెట్‌కు తీసుకువచ్చారు. కొనుగోలు చేయడానికి స్థానికులు ఎగబడ్డారు. దీని నుంచి నూనె తయారు చేసి ఆయుర్వేద వైద్యానికి ఉపయోగిస్తారు. 


ముంచంగిపుట్టులో డ్రాగన్‌ ఫ్రూట్స్‌ సాగు

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే : మన్యంలో డ్రాగన్‌ పండ్ల సాగు చేపడుతున్నారు. ముంచంగిపుట్టులోని ఓ ఆంగ్ల మాధ్యమ పాఠశాల ఆవరణలో నిర్వాహకులు విజయ్‌దాస్‌ ప్రయోగాత్మకంగా వంద మొక్కలు నాటారు. రెండేళ్ల క్రితం ఈ సాగు ప్రారంభించి ఆశించిన దిగుబడి సాధించారు. సేంద్రియ పద్ధతిలో ఈ సాగు చేపట్టారు. మైదాన ప్రాంతం కన్నా తక్కువ ధరకే ముంచంగిపుట్టులో వీటిని అందిస్తున్నారు. వనబసింగి పంచాయతీలోనూ ఈ సాగుకు శ్రీకారం చుట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని