logo

‘చీకట్లో మగ్గుతున్నాం’

రొంపల్లి పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాల్లో నేటికీ విద్యుత్తు సౌకర్యం కల్పించలేదని అక్కడి ప్రజలు కాగడాలతో నిరసన తెలిపారు.

Updated : 04 Jul 2024 04:42 IST

అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: రొంపల్లి పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాల్లో నేటికీ విద్యుత్తు సౌకర్యం కల్పించలేదని అక్కడి ప్రజలు కాగడాలతో నిరసన తెలిపారు. బురుగ, చినకోనెల గ్రామాల్లో కొండదొర తెగకు చెందిన 200 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ విద్యుత్తు సౌకర్యం లేకపోవడంతో రాత్రి పూట విషపురుగులు, పాముల భయంతో కాలం వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ ఇక్కడ రాత్రి బస ఏర్పాటు చేసి ఉంటే ఇబ్బందులు తెలుస్తాయని వార్డు సభ్యుడు సింహాచలం అన్నారు. గతంలో రాయిపాడు వద్ద పడుకుని ఉన్న ఈశ్వరరావును పాము కాటు వేస్తే ఆయన మృతి చెందాడన్నారు. బొడ్డవలస నుంచి 13 కిలోమీటర్లు దూరం విద్యుత్తు స్తంభాలు వేయాల్సి ఉండగా.. ఇటీవల కేవలం మూడు కిలోమీటర్లు దూరం మాత్రమే వేసి వదిలేశారని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం తమ సమస్య పరిష్కరించాలని కోరారు. కోటపర్తి కొత్తమ్మ, కోటపర్తి సింహాచలం, సోమెల అప్పలరాజు, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని