logo

పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు

రెండు రోజులుగా మండలంలోని ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు వాగులు పొంగి పొర్లాయి. వట్టిగెడ్డ జలాశయంలో నీరు అధికంగా చేరింది.

Published : 04 Jul 2024 01:23 IST

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: రెండు రోజులుగా మండలంలోని ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు వాగులు పొంగి పొర్లాయి. వట్టిగెడ్డ జలాశయంలో నీరు అధికంగా చేరింది. నెల్లిమెట్ల శివారు చప్టాపై వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లిమెట్ల నుంచి నెల్లిమెట్ల కాలనీ, లబ్బర్తి, లాగరాయి, కిండ్ర, కిండ్ర కాలనీ, ముంజవరప్పాడు, అనంతగిరి, చీడిపాలెం, సమీప అడ్డతీగల మండలానికి రోజూ వందలాది మంది ఈ మార్గం మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. శాశ్వత వంతెన నిర్మించాలని ఎన్ని సార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని