logo

హుద్‌హుద్‌ కాలనీల కథ అంతేనా?

గిరిజనులకు హుద్‌హుద్‌ తుపాను చేసిన గాయం ఇప్పటివరకు నయం కాలేదు. హుద్‌హుద్‌ తుపాను కారణంగా ఇళ్లు నష్టపోయిన గిరిజనులకు రక్షిత ప్రాంతంలో కాలనీలు నిర్మించి సొంత గూడు కల్పించాలని అప్పటి తెదేపా ప్రభుత్వం సంకల్పించింది.

Published : 02 Jul 2024 01:58 IST

అరకులోయ, న్యూస్‌టుడే: గిరిజనులకు హుద్‌హుద్‌ తుపాను చేసిన గాయం ఇప్పటివరకు నయం కాలేదు. హుద్‌హుద్‌ తుపాను కారణంగా ఇళ్లు నష్టపోయిన గిరిజనులకు రక్షిత ప్రాంతంలో కాలనీలు నిర్మించి సొంత గూడు కల్పించాలని అప్పటి తెదేపా ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా అరకులోయ మండలం సుంకరమెట్ట సమీపంలో స్థలం కేటాయించి గృహాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. సుంకరమెట్ట పంచాయతీ పరిధిలోని చినగంగుడి, పిరిబంద తదితర గ్రామాలవాసులకు ఇళ్లు నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం మారడంతో నిర్మాణాలు పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు.

అరకొరగా నిర్మించిన కొన్ని గృహాలను లబ్ధిదారులే కొంత వరకు పూర్తి చేసుకొని నివాసానికి అనుగుణంగా మార్చుకున్నారు. మరికొన్ని అసంపూర్తిగా నిలిచిపోయాయి. వీటిని వినియోగంలోకి తీసుకురాకపోవడంతో పొదలు పెరిగిపోయి అస్తవ్యస్తంగా మారాయి. అధికారులు సైతం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఐదేళ్లు పూర్తయినా వారి పక్కా గృహాలు పూర్తికాని పరిస్థితి. ఇప్పటికైనా గృహనిర్మాణ సంస్థ అధికారులు స్పందించి ఇళ్లను వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.  హుద్‌హుద్‌ కాలనీలో అసంపూర్తి గృహాలపై గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్ట్స్‌ డీఈఈ సత్యనారాయణను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. తాను ఇటీవలే డీఈఈగా బాధ్యతలు చేపట్టానని పేర్కొన్నారు. దీనిపై పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని