logo

రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం

రహదారుల నిర్మాణ పనులకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్‌ ఎ.ఎస్‌.దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 02 Jul 2024 01:57 IST

పాడేరు, న్యూస్‌టుడే: రహదారుల నిర్మాణ పనులకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్‌ ఎ.ఎస్‌.దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు. జిల్లాలో జరుగుతున్న ఇంజినీరింగ్‌ పనులపై గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, పీఐయూ, రహదారుల భవనాల శాఖ ఇంజినీరింగ్‌ అధికారులతో కలెక్టరేట్‌లో సోమవారం సమావేశం నిర్వహించారు. రంపచోడవరం, చింతూరు డివిజన్ల అధికారులు వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఇప్పటివరకు మంజూరు చేసిన పనులు ఎన్ని పూర్తయ్యాయి, ఎన్ని పురోగతిలో ఉన్నాయని ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులను గుర్తించి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ప్రాధాన్యత క్రమంలో గుత్తేదారులందరికీ సమానంగా బిల్లులు చెల్లించాలని పేర్కొన్నారు. ఐటీడీఏ పీఓలు వి.అభిషేక్, సూరజ్‌ గనోరే, చైతన్య, ఈఈలు డి.వి.ఆర్‌.ఎం.రాజు, కె.వేణుగోపాల్, బాలసుందరబాబు, కొండయ్యపడాల్, పీఐయూ ఏఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ 

పాడేరులోని సుండ్రుపుట్టు కాలనీలో లబ్ధిదారులకు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. రేషన్‌ అందుతోందా..? ఎన్ని కిలోల బియ్యం ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. డీఆర్‌డీఏ పీడీ మురళీ, ఎంపీడీఓ సాయినవీన్, ఈఓపీఆర్‌డీ రమేష్, సచివాలయ, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని