logo

జాతీయస్థాయి కుస్తీ పోటీలకు పయనం

కొయ్యూరు కస్తూర్బా విద్యాలయంలో చదువుతున్న ఆరుగురు విద్యార్థినులు జాతీయస్థాయి కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు సోమవారం బయలుదేరారు.

Published : 02 Jul 2024 01:54 IST

కొయ్యూరు, న్యూస్‌టుడే: కొయ్యూరు కస్తూర్బా విద్యాలయంలో చదువుతున్న ఆరుగురు విద్యార్థినులు జాతీయస్థాయి కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు సోమవారం బయలుదేరారు. కస్తూర్బాలో ఇంటర్‌ విద్యార్థినులు కె.లావణ్య, కె. కెజియ, కె.తబిత, బి.భార్గవి, కె.నిర్మల, కె.రాణి.. చిత్తూరులో మే నెలలో జరిగిన అండర్‌-17 రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. వీరంతా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 5 నుంచి 7 వరకు ఉత్తరాఖండ్‌లో జరిగే పోటీలకు పయనమయ్యారు. జాతీయస్థాయిలో వీరు పతకాలు సాధించాలని ఎస్‌వో పరిమళ, ఐటీడీఏ రెజ్లింగ్‌ అకాడమీ కోచ్‌ అంబటి నూకరాజు ఆకాంక్షించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని