logo

నమ్మండి.. ఇది రహదారేనండి!

దారెల పంచాయతీలోని 14 గ్రామాలకు వెళ్లే రహదారి నిర్మాణం కంకరరాళ్లకే పరిమితమైంది. పేదపేట నుంచి పేటమాలిపుట్టు, కుమ్మరిపుట్టు, డీంగుడ కూడలి వరకు రహదారి నిర్మాణం ప్రారంభించి అసంపూర్తిగా వదిలేశారు.

Published : 02 Jul 2024 01:53 IST

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే  : దారెల పంచాయతీలోని 14 గ్రామాలకు వెళ్లే రహదారి నిర్మాణం కంకరరాళ్లకే పరిమితమైంది. పేదపేట నుంచి పేటమాలిపుట్టు, కుమ్మరిపుట్టు, డీంగుడ కూడలి వరకు రహదారి నిర్మాణం ప్రారంభించి అసంపూర్తిగా వదిలేశారు. ఐదేళ్ల కిందట ప్రారంభించిన పనులు నేటికీ పూర్తికాలేదు. కంకర, పిక్కరాళ్లు రోడ్డుపై వేసి వదిలేశారు. దీంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పేటమాలిపుట్టు గ్రామ రైతులు వారు సాగుచేసిన కూరగాయలను వారపు సంతకు తరలించేందుకు అవస్థలు ఎదుర్కొంటున్నారు. పేదపేట నుంచి తలింభా వరకు తారురోడ్డు నిర్మించాలని, కంకర పోసి వదిలేసిన చోట్ల పనులు పూర్తి చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. నిధులు సరిపోక పనులు మధ్యలోనే నిలిచిపోయాయని, అదనపు నిధుల కోసం ప్రతిపాదనలు పంపించామని గిరిజన సంక్షేమశాఖ ఏఈ జబ్బర్‌ తెలిపారు. నిధులు మంజూరయ్యాక పనులు చేపడతామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని