logo

వాగులు పొంగే... రాకపోకలు ఆగే..

కొండవాగులు పొంగితే ఆ రెండు గ్రామాల గిరిజనులు బయట ప్రాంతాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Published : 02 Jul 2024 01:52 IST

దేవీపట్నం, న్యూస్‌టుడే: కొండవాగులు పొంగితే ఆ రెండు గ్రామాల గిరిజనులు బయట ప్రాంతాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి కొండవాగులు పొంగడంతో వెలగపల్లి-గుంపెనపల్లి గ్రామాల మధ్యలో ఉన్న సీతపల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహించింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పోశమ్మగండి వద్ద గోదావరి క్రమంగా పెరుగుతోంది. పెరిగిన వరద ఉద్ధృతికి చినరమణయ్యపేట-దండంగి గ్రామాల మధ్య సీతపల్లి వాగులో పూర్తిగా రాకపోకలు నిలిచాయి. ఈ నేపథ్యంలో మండలంలోని వి.రామన్నపాలెం పంచాయతీ పరిధిలోని గుంపెనపల్లి, లక్ష్మీపురం గ్రామాల గిరిజనులు సోమవారం వాగు దాటలేక అవస్థలు పడ్డారు. వాగుపై వంతెన ఏర్పాటు చేసి కష్టాలు తీరేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 


కాకరపాడు కష్టాలు తీరేలా కరుణించండయ్యా..

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: గూడెంకొత్తవీధి మండలం రింతాడ పంచాయతీ కాకరపాడుకు రహదారి కష్టాలు తీరేలా కరుణించండని ఆ గ్రామానికి చెందిన మామిడి భీమన్న, కాకరి మల్లేశ్వరరావు, భీమన్నలు సోమవారం ప్రభుత్వాన్ని కోరారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డు రూపే మారిపోయింది. రాళ్లు తేలిపోయి, బురదమయంగా మారి రాకపోకలకు అవస్థలకు గురిచేస్తోంది. ఈ రోడ్డు విషయంపై ఎన్నోసార్లు వైకాపా పాలకులకు చెప్పినా కరుణించలేదు. కూటమి ప్రభుత్వమైనా తమ కష్టాలకు పరిష్కారాన్ని చూపాలని వారు కోరుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని