logo

404 కేజీల గంజాయి స్వాధీనం

వేర్వేరు చోట్ల 404 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి తీసుకొచ్చి గంజాయిని ఒక చోట నిల్వ ఉంచి రవాణాకు సిద్ధపడుతుండగా ఒకరిని అరెస్టు చేసినట్లు చింతపల్లి సీఐ రమేశ్‌ తెలిపారు.

Published : 02 Jul 2024 01:48 IST

చింతపల్లి, పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: వేర్వేరు చోట్ల 404 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి తీసుకొచ్చి గంజాయిని ఒక చోట నిల్వ ఉంచి రవాణాకు సిద్ధపడుతుండగా ఒకరిని అరెస్టు చేసినట్లు చింతపల్లి సీఐ రమేశ్‌ తెలిపారు. అంజలీశనివారం పంచాయతీలోని కొత్తమాడెంబంద శివారులో గంజాయి రవాణాకు సిద్ధంగా ఉందంటూ సోమవారం తమకు సమాచారం వచ్చిందన్నారు. పోలీసు సిబ్బందితో ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా ఒక రహస్య ప్రదేశంలో సుమారు 254 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్న నిందితుడిని అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. ఎస్సై అరుణ్‌కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు. 

పెదబయలు మండలం సీతగుంట కూడలి వద్ద 150 కేజీల గంజాయిని ఆదివారం పట్టుకున్నట్లు సీఐ ఎస్‌.రమేష్, ఎస్సై మనోజ్‌కుమార్‌ సోమవారం తెలిపారు. ముందస్తు సమాచారంతో తనిఖీలు చేపడుతుండగా.. రెండు ద్విచక్రవాహనాలు, ఓ కారులో తరలిస్తున్న గంజాయి కనిపించింది. దాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీన్ని తరలిస్తున్న ముంచంగిపుట్టు మండలం కరిముఖిపుట్టు పంచాయతీ బలడ గ్రామానికి చెందిన వంతల సురేష్, పెదగూడ గ్రామానికి చెందిన కిల్లో లోకేష్, అరకులోయ మండలం పద్మాపురం గ్రామానికి చెందిన గొల్లొరి శివప్రసాద్, ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన వంతాల అర్జున్, ఖిల్లా గుతోను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని