logo

భారీ వర్షానికి పొంగిన వాగులు

మండలంలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత కురిసిన భారీ వర్షానికి ఆదివారం వాగులు  పొంగి ప్రవహించాయి. వీఆర్‌పురం- ఉమ్మడివరం మధ్య ప్రధాన రహదారిపైన అన్నవరం వాగు పొంగి ప్రవహించింది.

Published : 01 Jul 2024 02:18 IST

అన్నవరం రహదారిపై ఉప్పొంగిన వాగు

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: మండలంలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత కురిసిన భారీ వర్షానికి ఆదివారం వాగులు  పొంగి ప్రవహించాయి. వీఆర్‌పురం- ఉమ్మడివరం మధ్య ప్రధాన రహదారిపైన అన్నవరం వాగు పొంగి ప్రవహించింది. ఈ మార్గంలో వాగులకు ఇరువైపులా వాహనాలు ఉదయం 10 గంటల వరకు నిలిచిపోయాయి. ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో తహసీల్దార్‌ మౌలానా ఫాజిల్‌ వీఆర్‌ఏలను వాగుకు రెండువైపులా కాపలా పెట్టారు. రహదారిపైన వరదనీరు పూర్తిగా తొలిగిపోయే వరకు ఎవరిని ఆ దారిపై తిరగకుండా చూశారు.

నిండుగా జలాశయాలు

రంపచోడవరం, న్యూస్‌టుడే: ఏజెన్సీ ప్రాంతంలో మూడు రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.  భూపతిపాలెం, ముసురుమిల్లి జలాశయాలు నిండుకండల్లా మారాయి. రంపచోడవరంలో ఐటీడీఏ సి-క్వార్టర్స్, ఎర్రంరెడ్డి నగరం, టీచర్స్‌ కాలనీ తదితర ప్రాంతాలలో వర్షపునీరు జనావాసాల మధ్య నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మరో రెండు రోజులు వర్షాలు పడితే భూపతిపాలెం జలాశయం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నట్లు జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని