logo

భార్యలిద్దరు.. ‘మూడో పెళ్లి చేశారు’

భర్తకు ఇద్దరు భార్యలు కలిసి మూడో పెళ్లి చేశారు. వారే పెళ్లి పెద్దలుగా వ్యవహరించి అక్షింతలు వేశారు. పెదబయలు మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated : 01 Jul 2024 05:33 IST

మూడో పెళ్లి బ్యానర్‌లో కిందన ఇద్దరు భార్యల ఫొటోలు

పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: భర్తకు ఇద్దరు భార్యలు కలిసి మూడో పెళ్లి చేశారు. వారే పెళ్లి పెద్దలుగా వ్యవహరించి అక్షింతలు వేశారు. పెదబయలు మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని కించూరు గ్రామానికి చెందిన సాగేని పండన్నకు 2000లో పార్వతమ్మతో వివాహం జరిగింది. ఆమెకు సంతానం కలగలేదు. 2005లో అప్పలమ్మను వివాహం చేసుకున్నాడు. 2007లో ఈమెతో ఒక అబ్బాయి పుట్టాడు. తర్వాత పిల్లలు లేరు. ఈ క్రమంలో ఇద్దరు భార్యల అనుమతిలో మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. గత నెల 25న జరిగిన మూడో పెళ్లికి భార్యలే పెద్దలుగా వ్యవహరించి, పెళ్లి కార్డులు కొట్టించి, బ్యానర్లు వేయించారు. సంతానం కోసం తన భార్యలు త్యాగం చేశారంటూ పండన్న చెబుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని