logo

ప్రమాద బాధితులను ఆదుకుంటే పారితోషికం

రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు మానవత్వంతో స్పందించి వెంటనే బాధితులను సమీప ఆసుపత్రిలో చేర్చిన వారికి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రూ.5 వేలు నగదు బహుమతి ఇవ్వనున్నట్లుగా రవాణాశాఖ మంత్రి ఎం.రామ్‌ప్రసాద్‌ రెడ్డి తెలిపారు.

Updated : 01 Jul 2024 05:41 IST

నిబంధనల బోర్డులను ఆవిష్కరిస్తున్న మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి

విశాఖపట్నం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు మానవత్వంతో స్పందించి వెంటనే బాధితులను సమీప ఆసుపత్రిలో చేర్చిన వారికి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రూ.5 వేలు నగదు బహుమతి ఇవ్వనున్నట్లుగా రవాణాశాఖ మంత్రి ఎం.రామ్‌ప్రసాద్‌ రెడ్డి తెలిపారు. ఆదివారం విశాఖ విమానాశ్రయానికి విచ్చేసిన ఆయనకు రవాణాశాఖ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడ హాలులో ట్రాఫిక్‌ నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన డిస్‌ప్లే బోర్డులు, కరపత్రాలను ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించి వాటి నియంత్రణకు తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జేటీసీ వి.సుందర్, విశాఖ, అనకాపల్లి విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి, మన్యం జిల్లాల డీటీఓలు జి.సి.రాజారత్నం, జి.మనోహర్, మణికుమార్, ఏ.చంద్రశేఖర్‌రెడ్డి, లీలాప్రసాద్, శశికుమార్‌.. ఆర్టీవో ఆర్‌.సి.హెచ్‌. శ్రీనివాస్, పలువురు రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు.

‘ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం’

రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన  శాఖా మంత్రి ఎం.రామ్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు. విశాఖ నగర పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌    ఆధ్వర్యంలో పలువురు నాయకులు  గజమాలతో మంత్రిని సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రయాణికులను నిత్యం గమ్యస్థానాలకు చేర్చుతున్న ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అయితే కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధంగా ఉండాలని సూచించారు. అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిన ఆర్టీసీ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. అనంతరం మంత్రి రోడ్డు మార్గంలో నగరంలోకి వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు