గంజాయి స్మగ్లర్లు కటకటాల పాలు
రాజీవ్ రహదారి మీదుగా సినీఫక్కీలో పనస పండ్ల మధ్య 33 కిలోల గంజాయిని బొలెరో వాహనంలో తరలిస్తున్న స్మగ్లర్ల ముఠాను సైబరాబాద్ పోలీసులు శామీర్‌పేట టోల్గేట్ వద్ద అడ్డుకుని అదుపులోకి తీసుకుని ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు.
హైదరాబాద్, న్యూస్‌టుడే: రాజీవ్ రహదారి మీదుగా సినీఫక్కీలో పనస పండ్ల మధ్య 33 కిలోల గంజాయిని బొలెరో వాహనంలో తరలిస్తున్న స్మగ్లర్ల ముఠాను సైబరాబాద్ పోలీసులు శామీర్‌పేట టోల్గేట్ వద్ద అడ్డుకుని అదుపులోకి తీసుకుని ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. మేడ్చల్ జోన్ డీసీపీ ఎన్.కోటిరెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మీడియాకు వివరాలను వెల్లడించారు. జూన్ 28న హైదరాబాద్ నుంచి కరీంనగర్ రామగుండం వైపు.. అవుటర్ రింగ్‌రోడ్డు టోల్గేట్ సమీపంలో ఓ బొలెరో వాహనం పనస పండ్ల లోడ్‌తో ప్రయాణిస్తోంది. ఎస్కార్టుగా స్మగ్లర్లు ఓ కారులో ముందు వెళుతున్నారు. పక్కా సమాచారంతో మేడ్చల్ ఎస్వోటీ పోలీసులు, శామీర్‌పేట పోలీసులు సంయుక్తంగా ఆ రెండు వాహనాలను అడ్డుకుని తనిఖీ నిర్వహించారు. పనస పండ్ల మధ్యలో 33 కిలోల గంజాయిని స్వాధీనంచేసుకుని రెండు వాహనాల్లో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాకు చెందిన శివ ఏపీలోని రాజమండ్రిలో నివాసముంటూ వివిధ రాష్ట్రాలకు గంజాయిని సరఫరా చేస్తున్నారు. ఆయన సూచనలతో ఆంధ్రప్రదేశ్ ఏలూరుకు చెందిన గేదెల సతీష్(34), కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన కోరాడ సాయికుమార్(26), విశాఖపట్నం జిల్లా కె.కోటపాడుకు చెందిన బండారు శివకుమార్(27) ఒడిశాలో 33 కిలోల గంజాయిని 16 బండిళ్లుగా ప్యాకింగ్ చేసుకుని పనసపండ్ల లోడ్ మధ్య దాచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి రెండు వాహనాలు, గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నాలుగు చరవాణిలు, రూ.50వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. సతీష్, సాయికుమార్‌పై ఏపీలోని పలు ఠాణాల్లో గంజాయి స్మగ్లింగ్ కేసులు ఉన్నాయని డీసీపీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్లూరి స్మారకాల అభివృద్ధిపై ఆశలు
[ 04-07-2024]
మన్యం ప్రాంత ప్రజల గుండెల్లో చెదరని స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు. గిరిజనులతో కలిసి విల్లంబులు, బాణాలతో బ్రిటిష్ పాలకుల గుండెల్లో వణుకు పుట్టించిన వీరుడు ఆయన. -
అన్నదాతలకు అండగా.. ఆదివాసీలకు తోడుగా..
[ 04-07-2024]
ఆత్మహత్యలు పరిష్కారం కాదు.. సమస్య నుంచి ఎలా బయటపడాలన్నదే ముఖ్యమని కర్షకులకు ఆర్డీఎస్ఎస్ కౌన్సెలింగ్ ఇప్పిస్తోంది. ఆ సంస్థసీఈవో గాడి శ్రీను అలియాస్ బాలు కిసాన్ మిత్రా హెల్ప్‌లైన్ ప్రారంభించారు. -
రంగులు మార్చే సీతాకోకచిలుక
[ 04-07-2024]
సీతాకోకచిలుక.. దీని పేరు చెబితేనే అనేక ఆకట్టుకునే రంగులు గుర్తుకొస్తాయి. గొంగళి పురుగుగా ఉన్నప్పుడు ఒళ్లు జలదరించే స్థితి నుంచి అందంతో అందరినీ ఆకట్టుకునేలా తనని తాను తీర్చిదిద్దుకుంటుంది. -
ఆ ఇళ్ల సంగతేంటి?
[ 04-07-2024]
జిల్లాలో పక్కా ఇళ్ల నిర్మాణ పనులు నెమ్మదించాయి. వీటి నిర్మాణాలకు సంబంధించి కొత్త ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు. జిల్లాలో పునాదుల కోసం గోతులు తవ్విన ఇళ్లే దాదాపు 15,487 వరకు ఉన్నాయి. -
సమస్యలపై నిర్వాసితుల మొర
[ 04-07-2024]
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆధ్వర్యంలో బుధవారం చింతూరు ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించారు. -
‘చీకట్లో మగ్గుతున్నాం’
[ 04-07-2024]
రొంపల్లి పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాల్లో నేటికీ విద్యుత్తు సౌకర్యం కల్పించలేదని అక్కడి ప్రజలు కాగడాలతో నిరసన తెలిపారు. -
పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు
[ 04-07-2024]
రెండు రోజులుగా మండలంలోని ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు వాగులు పొంగి పొర్లాయి. వట్టిగెడ్డ జలాశయంలో నీరు అధికంగా చేరింది. -
నచ్చినోళ్లకు.. నిధులు కుమ్మరింత!
[ 04-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) నిధులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
సింహగిరిపై వైభవంగా వరద పాయస ఉత్సవం
[ 04-07-2024]
దేశంలో పంటలు బాగా పండేందుకు, అంతా సుభిక్షం ఉండేందుకు, వర్షాలు సమృద్ధిగా కురిపించాలని వైకుంఠ నారాయణనుడిని భక్తులు వేడుకున్నారు. -
ప్రమాదకరం ఘాట్‌రోడ్డు ప్రయాణం
[ 04-07-2024]
వాలమూరు నుంచి చింతూరు మండలం తులసిపాక వరకు 30 కిలోమీటర్ల మేర ఘాట్‌రోడ్డు ప్రమాదకరంగా ఉంది. ఇరుకైన మలుపులు, పక్కనే లోతైన అగాధాలు, మరోపక్క ఎత్తయిన కొండలతో ఉండే ఈ మార్గంలో వాహనాల రాకపోకలు కత్తిమీద సామే.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సందేహం అక్కర్లేదు.. నేనే అధ్యక్ష అభ్యర్థిని: బైడెన్
-
వరల్డ్ కప్ మెడల్‌తో పంత్.. ట్రోల్ చేసిన అక్షర్, సిరాజ్
-
ఇంకా పరారీలోనే భోలే బాబా.. ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
-
ఘనంగా వరలక్ష్మీ శరత్‌కుమార్ రిసెప్షన్.. తారల సందడి
-
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
-
అన్లిమిటెడ్ క్లెయిం మొత్తంతో ఐసీఐసీఐ ఆరోగ్య బీమా పాలసీ!