logo

గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తాం

గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు. పాడేరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని శనివారం ఆయన సందర్శించారు.

Published : 30 Jun 2024 01:42 IST

రోగులకు అందుతున్న వైద్యసేవలు పరిశీలిస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్,
చిత్రంలో ఆసుపత్రి పర్యవేక్షకురాలు విశ్వామిత్ర తదితరులు

పాడేరు, న్యూస్‌టుడే: గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు. పాడేరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని శనివారం ఆయన సందర్శించారు. ఆసుపత్రిలోని పలు విభాగాలు తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ.. బోధనా ఆసుపత్రి అనుమతులు జారీ చేయడానికి ఇటీవల ఎన్‌ఎంసీ బృందం పరిశీలించిందన్నారు. ఆపరేషన్‌ థియేటర్‌కు ఆక్సిజన్‌ సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఖాళీలు భర్తీ చేయాలని రీజనల్‌ డైరెక్టర్‌ను కోరతామని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతం వల్ల వైద్యులు ఇక్కడ పనిచేసేందుకు ముందుకు రావడం లేదని, అదనపు ఇన్సెంటివ్‌ ఇచ్చి వారిని నియమిస్తామని తెలిపారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దీన్ని పరిష్కరిస్తామని చెప్పారు. జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకురాలు విశ్వామిత్ర, వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ హేమలత, గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు కొండలరావు, తహసీల్దార్‌ కల్యాణ్‌ చక్రవర్తి, ఎంపీడీఓ నవీన్, ఏటీడబ్ల్యూఓ రజని, ఆసుపత్రి వైద్యాధికారులు పాల్గొన్నారు.

వైద్య కళాశాల నిర్మాణ పనుల తనిఖీ

పాడేరులో 35 ఎకరాల విస్తీర్ణంలో రూ.500 కోట్ల వ్యయంతో జరుగుతున్న వైద్య కళాశాల నిర్మాణ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. వైద్య విద్యార్థుల తరగతి గదులు, ల్యాబ్‌లు, బాలురు, బాలికల వసతిగృహాలు, నర్సింగ్‌ కళాశాల భవనాల నిర్మాణాలను తనిఖీ చేశారు. పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని ఎన్‌సీసీ ప్రతినిధులను ఆదేశించారు. వైద్య కళాశాల నిర్మాణ మ్యాప్‌లను పరిశీలించారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ హేమలత, ఏపీఎస్‌ఎంఐడీసీ ఈఈ అచ్చెన్నాయుడు, తహసీల్దార్‌ కల్యాణ్‌చక్రవర్తి, ఎంపీడీఓ నవీన్, ఏఈ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని