logo

రెండు రోజుల్లో ఖర్చుల వివరాలు సమర్పించాలి

సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల ఖర్చుల వివరాలను రెండు రోజుల్లో సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 30 Jun 2024 01:43 IST

ఏజెంట్లతో సమావేశమైన ఎన్నికల వ్యయ పరిశీలకులు పంకజ్‌ సింగ్, కలెక్టర్‌ దినేష్‌కుమార్, జేసీ భావన 

పాడేరు, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల ఖర్చుల వివరాలను రెండు రోజుల్లో సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అభ్యర్థులు, ఏజెంట్లు, ప్రతినిధులతో సమావేశం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో చేసిన ఖర్చుల వివరాలను సంబంధిత రికార్డుల్లో నమోదు చేసి సమర్పించాలని సూచించారు. పూర్తిగా పరిశీలించిన తరువాత ఎన్నికల కమిషన్‌కు పంపించాల్సి ఉంటుందన్నారు. నిధులు ఎక్కడ నుంచి వచ్చాయి, ఎవరు ఇచ్చారు. వంటి వివరాలతో ఖర్చులను పక్కాగా అందజేయాలని పేర్కొన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ భావన, ఎన్నికల వ్యయ పరిశీలకులు పంకజ్‌ సింగ్, నోడల్‌ అధికారి సువర్ణ ఫణి తదితరులు పాల్గొన్నారు.

  • పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరభ కుమార్‌ ప్రసాద్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌ భావన, డీఆర్‌డీఏ పీడీ పాల్గొన్నారు.
  • గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు. గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రధానోపాధ్యాయులు, డిప్యూటీ వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు.

అభివృద్ధి పనులకు నిధులివ్వాలని వినతి

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: దారెల పంచాయతీలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని సర్పంచి పాండురంగస్వామి, తెదేపా నాయకులు శనివారం జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. పెదపేట నుంచి తలింభా వరకు, డీంగుడ నుంచి పనస వరకు తారురోడ్డు నిర్మించాలని, దారెల, పేటమాలిపుట్టు, తలింబ, డొక్రిపుట్టు, గన్నెడ గ్రామాల్లో సిమెంటు రోడ్లు, కాలువలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని విన్నవించారు.

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: అరుకు పంచాయతీలో నెలకొన్న సమస్యలపై కలెక్టర్‌ దినేష్‌కుమార్‌కు వినతిపత్రం అందజేసినట్లు సర్పంచి శారద తెలిపారు. మురుగు కాలువల నిర్మాణానికి సహకరించాలని కోరారు. ప్రతి శుక్రవారం జరిగే వారపు సంతలో పారిశుద్ధ్య సమస్య నెలకొంటోందని, దీన్ని పరిష్కరించాలని పేర్కొన్నారు.

పాడేరు: కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ను భాజపా నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. భాజపా జిల్లా అధ్యక్షులు పాంగి రాజారావు, ఎస్టీ మోర్చా అధ్యక్షులు ఉమామహేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, పాడేరు నియోజకవర్గం అధ్యక్షులు కృష్ణారావు, మఠం శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని