logo

మా భూముల జోలికొస్తే ఊరుకోం

మాజీ సైనికుల పేరిట పలువురు తమ భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని గరుగుబిల్లి పంచాయతీ సింగవరం గ్రామస్థులు పేర్కొన్నారు.

Updated : 30 Jun 2024 05:15 IST

ఆందోళన చేస్తున్న సింగవరం గిరిజనులు

అనంతగిరి, న్యూస్‌టుడే: మాజీ సైనికుల పేరిట పలువురు తమ భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని గరుగుబిల్లి పంచాయతీ సింగవరం గ్రామస్థులు పేర్కొన్నారు. శనివారం వారు ఆందోళన చేపట్టారు. ఈ గ్రామంలో సర్వే నంబరు 22లో ఉన్న భూమిని రైతులు సాగుచేస్తున్నారు. ఇదే భూమికి తమకు పట్టాలు ఇచ్చారంటూ చాలా కాలంగా మాజీ సైనికుల పేరిట కొందరు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఇటీవల కొందరు వచ్చి సైనికుల పేర్లు చెప్పి తుప్పలు కొట్టినట్లు చెప్పారు. తామంతా వెళ్లి అడ్డుకున్నామని చెప్పారు. ఏళ్ల తరబడిగా తాము ఈ భూములను సాగు చేసుకుంటున్నామన్నారు. స్థానిక నాయకులు తమను వేధిస్తున్నట్లు ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు దృష్టి సారించాలని స్థానికులు జమ్మన్నదొర, పెంటయ్య, గిరి, రామన్నదొర, నాగరాజు, రవికుమార్‌ తదితరులు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని