logo

సీలేరులో గల్లంతై.. తిరిగిరాని లోకాలకు..

నదిలో శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు పడి గల్లంతైన బాలుడు సింకు(7) మృతిచెందాడు. అతడి మృతదేహం శనివారం ఉదయం కనిపించింది.

Published : 30 Jun 2024 01:33 IST

కొత్తపల్లిలో బాలుడి విషాదాంతం

కుమారుడి మృతదేహాన్ని పట్టుకుని విలపిస్తున్న తల్లిదండ్రులు, బంధువులు

మోతుగూడెం, న్యూస్‌టుడే: నదిలో శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు పడి గల్లంతైన బాలుడు సింకు(7) మృతిచెందాడు. అతడి మృతదేహం శనివారం ఉదయం కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి మోతుగూడెం ఎస్సై జి.గోపాలరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా మడతల్‌ గ్రామానికి చెందిన సోయం ముఖేష్‌ భువనేశ్వర్‌లో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన తన ఏడేళ్ల కుమారుడు సింకును వెంటబెట్టుకుని శుక్రవారం చింతూరు మండలం కొత్తపల్లిలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చారు. బాలుడు అక్కడ ఉన్న కొంతమందితో కలిసి సీలేరు నది వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు అందులో జారిపడి గల్లంతయ్యాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, బంధువులు, గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టారు. అతడు తప్పిపోయిన స్థలానికి కొంత దూరంలో శనివారం మధ్యాహ్నం మృతదేహం లభ్యమైంది. తిరిగొస్తాడనుకున్న బాలుడు విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు. చింతూరు ఏరియా ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని