logo

గంజాయి కేసులో ముగ్గురికి రెండేళ్ల జైలు

గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడిన ముగ్గురికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ స్థానిక తొమ్మిదో అదనపు జిల్లా జడ్జి కె.రత్నకుమార్‌ తీర్పు వెల్లడించారు.

Published : 30 Jun 2024 01:31 IST

చోడవరం, న్యూస్‌టుడే: గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడిన ముగ్గురికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ స్థానిక తొమ్మిదో అదనపు జిల్లా జడ్జి కె.రత్నకుమార్‌ తీర్పు వెల్లడించారు. జైలు శిక్షతోపాటు రూ.20 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. శిక్ష పడిన వారిలో పి.నాగేశ్వరరావు, ముక్కి సిద్దేశ్, మోహన్‌ ఉన్నారు. వీరు ముగ్గురూ ముంచంగిపుట్టు మండలం మకర గ్రామానికి చెందిన వారు. 2016 అక్టోబరులో చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద పోలీసులకు పట్టుబడ్డారు.

రూ.13 లక్షల విలువైన గంజాయితో ఇద్దరి అరెస్టు

చోడవరం పట్టణం: పోలీస్‌స్టేషన్‌ సమీపంలో పెట్రోలు బంకు వద్ద శనివారం ఓ కారును తనిఖీ చేసిన పోలీసులకు 300 కేజీల గంజాయి పట్టుబడింది. సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. పాడేరు నుంచి చోడవరం మీదుగా విశాఖకు కారులో గంజాయి రవాణా అవుతోందన్న సమాచారంతో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా వస్తున్న కారును పెట్రోలు బంకు వద్ద ఆపి తనిఖీ చేయగా రూ.13 లక్షల విలువైన గంజాయి పట్టుబడింది. కోరాపుట్‌కు చెందిన అనంత పాంగి, కిముడు నిరంజన్‌ను అదుపులోకి తీసుకుని కారు, గంజాయి ప్యాకెట్లను సీజ్‌ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు సీఐ చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని