logo

మా మదిలో మీరు.. మీ స్ఫూర్తికి జోహారు

‘భారతీయ పత్రికా రంగాన్ని మలుపుతిప్పిన ప్రజ్ఞాశాలి.. సినీరంగంలో తనదైన శైలిలో అద్భుతాలను ఆవిష్కరించిన ఘనాపాఠి.. ప్రపంచమే గర్వించే స్థాయిలో అతిపెద్ద సినీ స్టూడియో నిర్మించిన దార్శనికుడు.. పారిశ్రామిక రంగంలో తిరుగులేని విజయాలతో దూసుకెళ్లిన విజేత.. కలం బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పి.. ప్రజా సమస్యల పరిష్కారానికి వెన్నుదన్నుగా నిలిచిన ధీశాలి.. రామోజీరావు.’.. అంటూ పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కొనియాడారు.

Published : 28 Jun 2024 06:14 IST

ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణసభ

‘భారతీయ పత్రికా రంగాన్ని మలుపుతిప్పిన ప్రజ్ఞాశాలి.. సినీరంగంలో తనదైన శైలిలో అద్భుతాలను ఆవిష్కరించిన ఘనాపాఠి.. ప్రపంచమే గర్వించే స్థాయిలో అతిపెద్ద సినీ స్టూడియో నిర్మించిన దార్శనికుడు.. పారిశ్రామిక రంగంలో తిరుగులేని విజయాలతో దూసుకెళ్లిన విజేత.. కలం బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పి.. ప్రజా సమస్యల పరిష్కారానికి వెన్నుదన్నుగా నిలిచిన ధీశాలి.. రామోజీరావు.’.. అంటూ పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ శివారులోని కృష్ణా జిల్లా కానూరులో రామోజీ సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ సభను గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హాజరవ్వగా.. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, పలువురు రాష్ట్ర మంత్రులు, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  రామోజీరావు ఏ రంగంలో ప్రవేశించినా.. అకుంఠిత దీక్ష, పట్టుదల, క్రమశిక్షణతో విజయతీరాలను చేరేవారని, ఆయన చూపిన మార్గం నేటి తరానికి  ఆదర్శనీయమని ప్రముఖులు కొనియాడారు. సంస్మరణ సభలో వేలాది మంది సామాన్య ప్రజలు పాల్గొని మహనీయునికి నివాళులర్పించారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన  రామోజీరావు జీవిత ప్రస్థానం చిత్ర  ప్రదర్శన  ఆకట్టుకుంది.

ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రసంగిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌


మంత్రి కొల్లు రవీంద్ర, ఉమా తదితరుల నివాళి


రామోజీరావు జీవిత విశేషాలపై చిత్ర ప్రదర్శన


 సభకు తరలివచ్చిన ప్రజలు


నివాళి అర్పిస్తున్న ‘ఈనాడు’ తెలంగాణ ఎడిటర్‌ డి.ఎన్‌.ప్రసాద్‌


అంజలి ఘటిస్తున్న ‘ఈనాడు’ ఆంధ్రప్రదేశ్‌ ఎడిటర్‌ ఎం.నాగేశ్వరరావు


సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌


దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు


దగ్గుబాటి సురేష్‌బాబు


బోయపాటి శ్రీను


శ్యాంప్రసాద్‌ రెడ్డి


సినీ నటి జయసుధ


కీరవాణి, రాజమౌళి


కోనసీమ గోడిలంక నుంచి రామోజీ విగ్రహాన్ని తీసుకొస్తున్న మాధవరావు కుమారులు


తరలివస్తున్న నారీమణులు


అడుగడుగునా అభిమానమే..


‘మార్పు’ చిత్రంలో అతిథి పాత్రలో..


అలరించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శన

 ఈనాడు, అమరావతి న్యూస్‌టుడే, కానూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని