logo

CM Ramesh: అనతి కాలంలోనే అందరికీ ఆత్మీయుడైౖ.. చరిత్ర సృష్టించిన సీఎం రమేశ్‌

అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్‌ మెజార్టీ ఓట్లను సాధించారు. సార్వత్రిక ఎన్నికలకు మార్చి 16న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌  ఇచ్చింది.

Updated : 06 Jun 2024 09:03 IST

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్‌ మెజార్టీ ఓట్లను సాధించారు. సార్వత్రిక ఎన్నికలకు మార్చి 16న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌  ఇచ్చింది. భాజపా, తెదేపా, జనసేన కలసి పోటీచేయాలని నిర్ణయించుకున్నాయి. అనకాపల్లి పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేశ్‌ను ఆలస్యంగా ప్రకటించాయి. ఎన్నికలకు 50 రోజులకు మించి సమయం లేదు. మూడు పార్టీల శ్రేణులు పూర్తి సహకారాన్ని అందించడంతో తక్కువ సమయంలో ముమ్మర ప్రచారం చేశారు. పార్లమెంట్ చరిత్రలో ఏ అభ్యర్థికీ రాని 2,96,530 ఓట్ల మెజార్టీ దక్కించుకున్నారు. ఏడు నియోజకవర్గాల్లో 13,25,332 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో ఈవీఎంలో ఓటు వేసిన వారు 13,06,348 మంది ఉండగా పోస్టల్‌ బ్యాలెట్లలో 18,984 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం రమేశ్‌కు ఈవీఎంల్లో 7,50,027 ఓట్లు, పోస్టల్‌ బ్యాలెట్లలో 12,042 దక్కాయి. వైకాపా ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడుకు ఈవీఎం ఓట్లు 4,59,762, పోస్టల్‌ బ్యాలెట్లలో 5,777 ఓట్లు మాత్రమే వచ్చాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని