logo

Adilabad: విద్యాసంస్థల బంద్ ప్రశాంతం

నీట్ పరీక్ష రద్దు, ఎన్డీఏ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్‌లో విద్యార్థి సంఘాలు చేపట్టిన విద్యాసంస్థలు బంద్ విజయవంతమైంది.

Published : 04 Jul 2024 15:44 IST

ఆదిలాబాద్ కలెక్టరేట్: నీట్ పరీక్ష రద్దు, ఎన్డీఏ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్‌లో విద్యార్థి సంఘాలు చేపట్టిన విద్యాసంస్థలు బంద్ విజయవంతమైంది. ఒకరోజు ముందే బంద్‌కు పిలుపు ఇవ్వడంతో ప్రైవేటు సంస్థలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు తెరిచి ఉండటంతో నాయకులు అక్కడికి వెళ్లి విద్యార్థులను బయటకు పంపి తరగతులు బహిష్కరించారు. నిరసనలో నాయకులు శాంతన్, కపిల్, కేశవ్, నగేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని