logo

కోటాను కోట్లు.. నీరందక పాట్లు

రూ. కోట్ల వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మారాయి. అసంపూర్తి పనులు, నిర్వహణలోపం, మరమ్మతుల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది.

Published : 05 Jul 2024 04:16 IST

నిర్వహణ, మరమ్మతులు లేక ఎత్తిపోతల పథకాలు నిరుపయోగం
చెన్నూరు గ్రామీణం, న్యూస్‌టుడే

రూ. కోట్ల వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మారాయి. అసంపూర్తి పనులు, నిర్వహణలోపం, మరమ్మతుల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. ఒకటి, రెండు పనులు పూర్తయినా వినియోగంలోకి రాక దిష్టిబొమ్మలా పడిఉన్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో 2009 నుంచి 2011లో అప్పటి ప్రభుత్వం జిల్లాలోని 11 ఎత్తిపోతల పథకాలు చేపట్టారు. చెన్నూరు మండలంలోని నర్సక్కపేట, సోమన్‌పల్లి, సుందర్‌శాల, కోటపల్లిలో బోరంపల్లి, వెంచపల్లి, సిర్సా, అర్జున్‌గుట్ట, జైపూరు మండలంలోని షెట్‌పల్లి, బెజ్జాల, కిష్టాపూర్, శివ్వారం, గ్రామాల్లో గోదావరి, ప్రాణహితనది ఒడ్డున ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారు. కోటపల్లి మండలంలోని వెంచపల్లి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందుతోంది. మిగతావి నిరుయోగంగా మారాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, 2022లో భారీ వరదల కారణంగా నర్సక్కపేట, బోరంపల్లి, షెట్‌పల్లి, బెజ్జాల ఎత్తిపోతల పథకాలు కాలగర్భంలో కలిశాయి.

  • నిర్మాణ వ్యయం (రూ. కోట్లలో)
  • ఆయకట్టు (ఎకరాలు)
  • సాగునీరందించే గ్రామాలు
  • ప్రస్తుత పరిస్థితి
  • పరిష్కారం

సోమన్‌పల్లి ఎత్తిపోతల పథకం

  • 33
  • 3,600  
  • సోమన్‌పల్లి, ఆస్నాద్, పొన్నారం
  • మొసళ్ల సంరక్షణ ప్రాంతం కావడంతో నీళ్లు ఎత్తిపోసేందుకు అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు లేక పనులు పూర్తయిన నిరుపయోగంగా మారింది.
  • ప్రజాప్రతినిధులు దిల్లీ స్థాయిలో ప్రత్యేక చొరవ చూపితే అనుమతి వచ్చే అవకాశముంది.

సుందర్‌శాల

  • 9.46 
  • 2,250
  • సుందర్‌శాల, దుగ్నెపల్లి, వెంకంపేట
  • అన్నారం బ్యారేజీ బ్యాక్‌వాటర్‌తో పథకం ముంపునకు గురవుతోంది.
  • కరకట్ట నిర్మాణం చేపట్టి, మిగిలిన పనులు పూర్తిచేస్తే వినియోగంలోకి వచ్చే అవకాశముంది.

అర్జున్‌గుట్ట  

  • 8.58
  • 1500
  • అర్జునగుట్ట, రాపన్‌పల్లి, దేవులవాడ
  • ర్యాంపు ధ్వంసం కావడంతో పాటు నిర్వహణ లోపం కారణంగా పనిచేయడం లేదు.
  • మరమ్మతులు చేపట్టేందుకు రూ. 60 లక్షలతో ప్రతిపాదనలు పంపించారు. నిధులు మంజూరు చేస్తే వినియోగంలోకి వస్తుంది.

సిర్సా

  • 18  
  • 2,700  
  • సిర్సా, అన్నారం, పుల్లగాం
  • సంబంధిత గుత్తేదారులు వివిధ కారణాలతో పనులు పూర్తిచేయకుండా వదిలేశాడు.
  • ప్రభుత్వం నిధులు మంజూరు చేసి తిరిగి పనులను ప్రారంభించి పూర్తి చేయిస్తే లక్ష్యం నెరవేరుతుంది.

కిష్టాపూర్‌

  • 19
  • 4,000  
  • కిష్టాపూర్, కుందారం, వేలాల
  • 80శాతం పనులుచేసి 2014 డిసెంబరులో పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. లీకేజీలు, మరమ్మతులు, వివిధ కారణాలతో  నిరుపయోగంగా మారింది.
  • నిధులు మంజూరు చేసి మిగతా పనులు పూర్తిచేస్తే వినియోగంలోకి వస్తుంది.

శివ్వారం

  • 16.94  
  • 2,300  
  • శివ్వారం, పౌనూర్, గోపాల్‌పూర్‌  
  • శివ్వారం మొసళ్ల సంరక్షణ కేంద్రం ఉండటంతో నీళ్లు ఎత్తిపోసేందుకు అటవీ, పర్యావరణ శాఖల అనుమతి లేక 90శాతం పనులు పూర్తయినా ఫలితం లేకుండా పోయింది.
  • అనుమతులు వచ్చే ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని