logo

చీకట్లో బాధితులు.. రెండు గంటలు అవస్థలు

మంచిర్యాలలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్‌)లో బుధవారం అర్ధరాత్రి విద్యుత్తు సరఫరాలో అంతరాయం గందరగోళాన్ని సృష్టించింది.

Updated : 05 Jul 2024 06:27 IST

ఎంసీహెచ్‌లో విద్యుత్తు అంతరాయంతో గందరగోళం

చీకట్లో బాలింతల వార్డు

మంచిర్యాల సిటీ, న్యూస్‌టుడే: మంచిర్యాలలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్‌)లో బుధవారం అర్ధరాత్రి విద్యుత్తు సరఫరాలో అంతరాయం గందరగోళాన్ని సృష్టించింది. ఆసుపత్రికి సంబంధించిన ఎలక్ట్రీషియన్‌ మరమ్మతుల నిర్ణయం, దీనికి తోడు విద్యుత్తు శాఖ సిబ్బంది సకాలంలో స్పందించకపోవడంతో రెండు గంటల పాటు బాధితులు అంధకారంలో ఉండాల్సి వచ్చింది. ఓవైపు ఉక్కపోతతో బాలింతల అవస్థలు, మరోవైపు శిశువుల ఏడుపుతో ఆసుపత్రి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది. రెండు గంటలపాటు భవనం, బాధితులు చీకట్లోనే ఉన్నారు. ఈ మరమ్మతులకు ముందస్తుగా అప్రమత్తం చేయడం కొంత ఉపశమనం కలిగించే అంశం. ఎలాంటి ప్రమాదకర పరిస్థితి రాకుండా జాగ్రత్తలు చేసి పనులు చేపట్టారు. రాత్రి 9:30 గంటలకు మొదలై తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో పూర్తికావడం గమనార్హం.

అంధకారంలో ఎంసీహెచ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని