logo

బస్సులో గుండెపోటుతో ఏఎస్‌ఐ మృతి

నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ కేసులో నిందితుడి కోసం వెళ్లేందుకు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వస్తున్న సీఐడీ ఏఎస్‌ఐ సెట్విన్‌ బస్సులో గుండెపోటుతో మృతి చెందారు.

Published : 05 Jul 2024 03:55 IST

సికింద్రాబాద్, న్యూస్‌టుడే : నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ కేసులో నిందితుడి కోసం వెళ్లేందుకు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వస్తున్న సీఐడీ ఏఎస్‌ఐ సెట్విన్‌ బస్సులో గుండెపోటుతో మృతి చెందారు. గోపాలపురం పోలీసుల కథనం ప్రకారం.. టోలిచౌక్‌లో ఉంటున్న ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన యూనస్‌ఖాన్‌ సీఐడీలో ఏఎస్‌ఐ. ఒక కేసులో కోర్టుకు హాజరు కాని నిందితుడికి కోసం ఎస్సై, కానిస్టేబుల్‌తో కలిసి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి గౌతమీ ఎక్స్‌ప్రెస్‌లో భీమవరం వెళ్లాల్సి ఉంది. మెహిదీపట్నం నుంచి రూట్‌ 5కే సెట్విన్‌ బస్సులో యూనస్‌ఖాన్‌ బుధవారం సాయంత్రం సికింద్రాబాద్‌కు బయలుదేరాడు. బస్సు బాటా వద్దకు వచ్చే సరికి గుండెపోటు రావడంతో సీటులో నుంచి జారి కిందపడ్డాడు. ఇతర ప్రయాణికులు సీపీఆర్‌ చేయడంతో పాటు సికింద్రాబాద్‌ స్టేషన్‌ వద్దకు తీసుకుని వచ్చి పోలీసులు, 108 సిబ్బందికి సమాచారం అందించారు. 108 సిబ్బంది వచ్చి పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం గురువారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని