logo

ఆర్జీయూకేటీలో తగ్గిన ప్రవేశాలు

ఆర్జీయూకేటీలో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశాల జాబితాను బుధవారం విడుదల చేసింది.

Updated : 04 Jul 2024 05:25 IST

రాష్ట్రంలో నిర్మల్‌ జిల్లాకు ఐదో స్థానం
ముథోల్‌(బాసర), న్యూస్‌టుడే 

ర్జీయూకేటీలో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశాల జాబితాను బుధవారం విడుదల చేసింది. మొత్తం 15000 దరఖాస్తులు రాగా సీటు పొందిన 1404 మంది విద్యార్థుల జాబితాను హైదరాబాద్‌లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేష్, విశ్వవిద్యాలయ ఇన్‌ఛార్జి ఉపకులపతి విడుదల చేశారు. జాబితాను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో నిర్మల్‌ జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవగా ఆర్జీయూకేటీలో మాత్రం అయిదో స్థానానికే పరిమితమైంది. గత సంవత్సరంతో పోల్చితే ఈ సారి ఉమ్మడి జిల్లాలో 18 సీట్లు తగ్గాయి. నిర్మల్‌ జిల్లా నుంచి గత ఏడాది 92 మంది విద్యార్థులు ఎంపికవగా.. ఈ సారి 72 మంది విద్యార్థులు మాత్రమే ఎంపికయ్యారు.

ఈసారి 20 సీట్లు తగ్గాయి..

నిర్మల్‌ జిల్లా నుంచి గతేడాది ఆర్జీయూకేటీకి 92 మంది విద్యార్థులు ఎంపికవగా ఈ సారి 72 మంది విద్యార్థులు మాత్రమే ఎంపికయ్యారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. అధిక సంఖ్యలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినప్పటికీ మార్కుల శాతం తక్కువగా ఉండటంతో సీట్ల సంఖ్య పెరగడం లేదు. 

ఉమ్మడి జిల్లాలో 131 మంది ఎంపిక..

బాసర ఆర్జీయూకేటీకి ఉమ్మడి జిల్లా నుంచి 131 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. గత సంవత్సరం 149 మంది విద్యార్థులు ఎంపిక కాగా గతంతో పోల్చుకుంటే ఉమ్మడి జిల్లాలో 18 సీట్లు తగ్గాయి. నిర్మల్‌ 72, మంచిర్యాల 28, ఆదిలాబాద్‌ 27, కుమురంభీం నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. నిర్మల్‌ విద్యార్థులను జిల్లా పాలనాధికారి అభిలాష అభినవ్, జిల్లా విద్యాధికారి రవీందర్‌లు అభినందించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని