logo

ప్లాస్టిక్‌ రహితంగా పట్టణ రైతుబజార్‌

సాధారణంగా కూరగాయలకు వెళ్తే చాలా మంది ఖాళీ చేతులతో వెళ్తుంటారు. ఆదిలాబాద్‌ రైతు బజారులో మాత్రం ఇంటి నుంచి వెళ్లేటప్పుడే చేతిలో సంచి పట్టుకొని బయలుదేరుతారు.

Published : 03 Jul 2024 03:56 IST

జూట్, గుడ్డతో తయారు చేసిన చేతి సంచుల్లో కూరగాయలు తీసుకెళ్తున్న  పట్టణవాసులు

సాధారణంగా కూరగాయలకు వెళ్తే చాలా మంది ఖాళీ చేతులతో వెళ్తుంటారు. ఆదిలాబాద్‌ రైతు బజారులో మాత్రం ఇంటి నుంచి వెళ్లేటప్పుడే చేతిలో సంచి పట్టుకొని బయలుదేరుతారు. లేకుంటే కూరగాయలు కొనలేరు మరి. ఎందుకంటే అక్కడ ప్లాస్టిక్‌ నిషేధం అమల్లో ఉంది.  రైతులంతా ఏకాభిప్రాయంగా ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించాలనుకున్నారు. జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా ఆదేశాల మేరకు 15 రోజుల కిందట మార్కెటింగ్‌ అధికారి శ్రీనివాస్‌ ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీనికి రైతులు సైతం మద్దతు పలకడంతో ప్లాస్టిక్‌ కవర్ల నిషేధం చాలా సులువైంది. ఎవరైనా పాలిథీన్‌ సంచులను వాడితే వారికి జరిమానా సైతం విధించడంతో మొదట్లో వ్యాపారం చేసుకునే రైతులు కాస్త ఇబ్బంది పడినా ఇప్పుడు అలవాటుపడ్డారు. పట్టణవాసులు సైతం పాలిథీన్‌ సంచుల కంటే జూట్తో తయారు చేసినవి పర్యావరణానికి ప్రయోజనకరం అని తెలుసుకొని వాటినే వినియోగిస్తున్నారు. రైతుబజార్‌ పరిసర ప్రాంతాల్లో పలు దుకాణాల్లో జూట్, గుడ్డతో తయారు చేసిన చేతి సంచులను విక్రయానికి ఉంచారు. ప్రస్తుతం వీటికి మంచి గిరాకీ పెరిగింది. ప్రతి 15 నిమిషాలకోసారి మైక్‌లో ఇక్కడ ప్లాస్టిక్‌ నిషేధమంటూ ప్రచారం చేస్తున్నారు.

ఈనాడు, ఆదిలాబాద్‌
 న్యూస్‌టుడే, పాలనాప్రాంగణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని