logo

అరకొర హాజరుతో ముగించారు

జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశాలంటే మినీ అసెంబ్లీతో సమానంగా భావిస్తారు. జిల్లా వ్యాప్తంగా సమస్యలపై చర్చించే వీలున్న ఈ సమావేశాలకు కలెక్టర్, అన్నిశాఖల జిల్లా అధికారులు హాజరవుతారు.

Updated : 03 Jul 2024 05:46 IST

అయిదేళ్ల జడ్పీ సమావేశాల్లో ప్రజాప్రతినిధుల తీరిది..
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పట్టణం

జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశాలంటే మినీ అసెంబ్లీతో సమానంగా భావిస్తారు. జిల్లా వ్యాప్తంగా సమస్యలపై చర్చించే వీలున్న ఈ సమావేశాలకు కలెక్టర్, అన్నిశాఖల జిల్లా అధికారులు హాజరవుతారు. జిల్లాస్థాయిలో పరిష్కారంకాని అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఇక్కడ తీర్మానం చేస్తే నివేదిక ప్రభుత్వానికి వెళుతుంది. అందుకే జడ్పీ తీర్మానాలకూ అధిక ప్రాధాన్యం ఉంటుందనే భావన ఉంది. జడ్పీటీసీలు సభ్యులుగా, ఎంపీపీలు ఆహ్వానితులుకాగా, ఈ సమావేశాలకు జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యుల హోదాలో హాజరవుతారు. అపరిష్కృతంగా ఉండే సమస్యలను ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించేలా రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లే సత్తా ఉన్న వీరు జడ్పీ సమావేశాలకు ముఖం చాటేయడం విమర్శలకు తావిస్తోంది. అయిదేళ్ల జడ్పీ పాలకవర్గం జులై 4తో ముగియనుంది. ఇప్పటికే జడ్పీ చివరి సమావేశం అయిపోయింది. ప్రజాప్రతినిధులు హాజరు పరిస్థితిపై కథనం.

జిల్లాలో ఆదిలాబాద్, బోథ్‌ అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తిగా విస్తరించి ఉండగా రెండు మండలాల పరిధి ఉన్న ఖానాపూర్, రెండు మండలాలు విస్తరించి ఉన్న ఆసిఫాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్‌లో సభ్యులు. మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు ఆహ్వానితులు. స్థానిక ఎంపీ, స్థానిక సంస్థలు, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు జడ్పీకి శాశ్వత ఆహ్వానితులుగా హాజరుకావాల్సి ఉంటుంది. వీరంతా సభలో ఉంటే అధికారుల్లోనూ జవాబుదారీతనం పెరిగి సమస్యకు త్వరితగతిన పరిష్కారం లభించే అవకాశం లభిస్తుందనేది ప్రజల నమ్మకం. వీరిలో కొందరు మాత్రమే సక్రమంగా హాజరయ్యారు. మిగతా వారు మొక్కుబడిగా రాగా కొందరైతే మొత్తానికే రాలేదు. రైతుల విత్తనాల సరఫరాలో జాప్యం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే పనుల్లో జాప్యం వంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. పాఠశాలల్లో మౌలిక వసతులు, రహదారులు లేక ప్రజలు పడుతున్న నరకయాతన, నిధులు మంజూరైనా అధికారుల నిర్లక్ష్యంతో పూర్తికాని రోడ్లు, భవనాలు ఇలా ఎన్నో ఇక్కట్లతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఎక్కువ శాతం ప్రజాప్రతినిధులు గైర్హాజరు కావడం ప్రజలకు ఎక్కువ నష్టాన్ని చేకూర్చిందని చెప్పవచ్చు.

19 సమావేశాలు

అయిదేళ్లలో 19 జడ్పీ సమావేశాలు జరిగాయి. అందులో మూడు సమావేశాలను కోరం లేక వాయిదా వేయగా 16 సమావేశాలు నిర్వహించారు. అయిదేళ్ల కాలంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ పదవీ కాలం పూర్తవడంతో ఆ కోటాలో దండె విఠల్‌ ఎంపికయ్యారు. ఎంపీ సోయం పదవీ కాలం పూర్తయి కొత్త ఎంపీగా గోడం నగేష్‌ అడుగుపెట్టారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న స్థానంలో పాయల్‌శంకర్‌ ఇటీవలే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బోథ్‌లో రాఠోడ్‌ బాపురావు స్థానంలో అనిల్‌ జాదవ్, ఖానాపూర్‌లో రేఖానాయక్‌ స్థానంలో వెడ్మ బొజ్జు, ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు స్థానంలో కోవ లక్ష్మి ఎమ్మెల్యేగా ఎన్నికై ఇక్కడ సభ్యులుగా కొనసాగుతున్నారు.

 పదవీ కాలంలో జరిగిన సమావేశాలు - హాజరైనవి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని