logo

రూ. 9 లక్షల ధాన్యం డబ్బులు సొంతానికి వినియోగం

జన్నారం మండలం పొనకల్‌ పీఏసీఎస్‌ పరిధిలోని పలువురు రైతుల ధాన్యం డబ్బుల్లో రూ. 9 లక్షలు తన సొంతానికి వాడుకున్నట్లు కొనుగోలు కేంద్రం ఇన్‌ఛార్జి, చింతలపల్లికి చెందిన గాందోరి రవి మంగళవారం లిఖిత పూర్వకంగా రాసి సీఈఓ రాజన్నకు అందజేశాడు.

Published : 03 Jul 2024 03:27 IST

లిఖిత పూర్వకంగా ఒప్పుకొన్న కేంద్రం ఇన్‌ఛార్జి

జన్నారం, న్యూస్‌టుడే: జన్నారం మండలం పొనకల్‌ పీఏసీఎస్‌ పరిధిలోని పలువురు రైతుల ధాన్యం డబ్బుల్లో రూ. 9 లక్షలు తన సొంతానికి వాడుకున్నట్లు కొనుగోలు కేంద్రం ఇన్‌ఛార్జి, చింతలపల్లికి చెందిన గాందోరి రవి మంగళవారం లిఖిత పూర్వకంగా రాసి సీఈఓ రాజన్నకు అందజేశాడు. బాదంపల్లి, చింతలపల్లి గ్రామాలకు చెందిన 15 మంది రైతుల డబ్బులు ఇతరుల ఖాతాల్లోకి మళ్లించినట్లు కొనుగోలు కేంద్రాల ఇన్‌ఛార్జి ఒప్పుకున్నారు. బాదంపల్లికి చెందిన కమలాకర్, అర్జవ్వకు చెందిన 243 బస్తాల సొమ్మును మరో వ్యక్తి ఖాతాలోకి, చింతలపల్లికి చెందిన జింక లచ్చన్న అనే రైతు డబ్బులను ఇంకొకరి బ్యాంకు ఖాతాలో జమ చేసి వాడుకున్నట్లు రవి అంగీకరించాడు. ఇదిలా ఉండగా సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారి(ఏఈఓ) నుంచి లాగిన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ తతంగం మొత్తం ఏఈఓకు తెలిసే జరిగినట్లు పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. రవి ఇదంతా చేసేందుకు కొనుగోలు కేంద్రం పరిధిలోని డైరెక్టర్‌తో పాటు వ్యవసాయ విస్తరణాధికారి ప్రమేయం ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తంలో తనకు ఎలాంటి సంబంధం లేదని కొనుగోలు కేంద్రం ఇన్‌ఛార్జిని పాలక వర్గం తీర్మానం మేరకే నియమించామని సీఈఓ రాజన్న తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని