logo

హరితవనంలో గంజాయి మొక్క

పట్టణ ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణలో హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి చెట్లుగా ఎదిగాయి. హరితవనాన్ని తలపిస్తున్న చెట్ల మధ్య ఓ గంజాయి మొక్క కూడా ఏపుగా 10 అడుగుల ఎత్తు పెరిగింది.

Published : 02 Jul 2024 05:51 IST

భైంసా, న్యూస్‌టుడే: పట్టణ ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణలో హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి చెట్లుగా ఎదిగాయి. హరితవనాన్ని తలపిస్తున్న చెట్ల మధ్య ఓ గంజాయి మొక్క కూడా ఏపుగా 10 అడుగుల ఎత్తు పెరిగింది. చెట్ల మధ్య రాలిన ఆకు, చెత్తాచెదారం శుభ్రం చేసే సిబ్బంది కంటపడకుండా ఇంత ఎత్తు ఎలా పెరిగిందనే ప్రశ్న తలెత్తుతోంది. ఎవరైనా కావాలనే పెంచుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వందలాది మంది రోగులు వచ్చే ఆసుపత్రిలో పెరుగుతున్న గంజాయి మొక్క ఎవరి కంట పడకపోవడం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని