logo

వందేభారత్‌ నిలపాలని రైల్వేబోర్డు ఛైర్‌పర్సన్‌కు వినతి

హైదరాబాద్‌ నుంచి నాగ్‌పూర్‌కు వెళ్లే వందేభారత్‌ సూపర్‌ఫాస్ట్‌ రైలును మంచిర్యాలలో నిలపాలని కోరుతూ రైల్వే బోర్డు ఛైర్‌పర్సన్‌  జయవర్మసిన్హాకు భాజపా నాయకులు వినతిపత్రం అందజేశారు.

Published : 02 Jul 2024 05:36 IST

మంచిర్యాల సిటీ, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ నుంచి నాగ్‌పూర్‌కు వెళ్లే వందేభారత్‌ సూపర్‌ఫాస్ట్‌ రైలును మంచిర్యాలలో నిలపాలని కోరుతూ రైల్వే బోర్డు ఛైర్‌పర్సన్‌  జయవర్మసిన్హాకు భాజపా నాయకులు వినతిపత్రం అందజేశారు. మాజీ ఎంపీ వెంకటేష్‌నేత, జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్, మహళా మోర్చా అధ్యక్షురాలు జోగుల శ్రీదేవి, భాజపా సీనియర్‌ నాయకుడు మోటపల్కుల తిరుపతి సోమవారం ఆమెను దిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి సంబంధిత పలు సమస్యలను చర్చించారు. వందేభారత్‌తో పాటు కేరళ, ఏపీ ఎక్స్‌ప్రెస్, మంచిర్యాల నుంచి తిరుపతికి నూతనంగా రైలు ప్రారంభించాలని కోరినట్లు రఘునాథ్‌ తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని