logo

పిల్లలతో వెట్టిచాకిరి చేయిస్తే క్రిమినల్‌ కేసులు

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని రామగుండం పోలీసు కమిషనర్‌ శ్రీనివాస్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Published : 02 Jul 2024 05:35 IST

మంచిర్యాలనేరవిభాగం, న్యూస్‌టుడే: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని రామగుండం పోలీసు కమిషనర్‌ శ్రీనివాస్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జులై నెలలో ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా ప్రతి డివిజన్‌కు ఎస్సై స్థాయి అధికారితో పాటు నలుగురు సిబ్బందిని నియమించినట్లు ఆయన తెలిపారు. పోలీసు శాఖతో పాటు కార్మిక, విద్య, ఆరోగ్య, చిన్నారుల సంరక్షణ శాఖ అధికారులు ఓ బృందంగా ఏర్పడి తనిఖీలు చేస్తారన్నారు. ఎవరైనా చిన్నారులతో వెట్టిచాకిరి చేయిస్తున్నట్లు తేలితే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బాలకార్మికులు కనిపిస్తే 1098, 100కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని కోరారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని