logo

నకిలీ విత్తనాల కేసులో ముగిసిన పోలీసు కస్టడీ

నకిలీ పత్తి విత్తనాల కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు నాలుగు రోజుల కిందట విచారణ నిమిత్తం పోలీసు కస్టడీకి తీసుకోగా గడువు పూర్తవ్వటంతో సోమవారం తిరిగి కోర్టులో ప్రవేశ పెట్టారు.

Published : 02 Jul 2024 05:27 IST

జుడీషియల్‌ కస్టడీకి నిందితులు

ఆదిలాబాద్‌ నేర విభాగం, న్యూస్‌టుడే : నకిలీ పత్తి విత్తనాల కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు నాలుగు రోజుల కిందట విచారణ నిమిత్తం పోలీసు కస్టడీకి తీసుకోగా గడువు పూర్తవ్వటంతో సోమవారం తిరిగి కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు మళ్లీ వారికి జుడీషియల్‌ కస్టడీ విధించటంతో జైలుకు తరలించారు. నకిలీ పత్తి విత్తనాల తయారీ కేసులో గతంలో బెయిల్‌ పొందిన సామ అశోక్‌రెడ్డి, అప్పాల రాజేందర్‌ల బెయిల్‌ను పోలీసుల అభ్యర్థన మేరకు న్యాయస్థానం రద్దు చేసింది. దీంతో కోర్టులో వారు లొంగిపోగా గత నెల 24న కోర్టు రిమాండ్‌ విధించింది. అనంతరం విచారణ నిమిత్తం నిందితులను పోలీసు కస్టడీకి అనుమతించాలని మావల పోలీసులు పిటిషన్‌ దాఖలు చేయగా నాలుగు రోజుల కోసం న్యాయస్థానం అనుమతించింది. గ్రామీణ సీఐ ఫణిధర్, మావల ఎస్‌ఐ వంగ విష్ణువర్ధన్‌ ఇద్దరు నిందితులను గత నెల 28న కస్టడీలోకి తీసుకొని లోతుగా విచారణ జరిపారు. వారి నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది. సోమవారంతో పోలీసు కస్టడీ ముగియటంతో నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం వారిద్దరికి జుడీషియల్‌ కస్టడీ విధించినట్లు డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి తెలిపారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని