logo

శాంతిఖని గనిలో కార్మికుడికి అస్వస్థత

బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని భూగర్భ గనిలో కార్మికుడు అస్వస్థతకు గురై కింద పడిపోయిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.

Published : 01 Jul 2024 04:42 IST

బెల్లంపల్లి పట్టణం, న్యూస్‌టుడే: బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని భూగర్భ గనిలో కార్మికుడు అస్వస్థతకు గురై కింద పడిపోయిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. గనిలోని జేఎంస్‌ కంపెనీలో పనిచేస్తున్న షరీఫుల్లా ఇస్లాం 67వ లెవల్‌లో ప్రీషిఫ్ట్‌లో సపోర్టింగ్‌ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆ సమయంలోనే ఒక్కసారిగా ఊపిరి సరిగ్గా ఆడక కళ్లు తిరిగి కిందపడిపోయాడు. గమనించిన తోటి కార్మికులు వెంటనే అధికారులకు సమాచారం అందించి గని ఉపరితలానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు కార్మికుడికి వైద్య సేవలు అందించారు. కార్మికుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. పని ప్రదేశాల్లో గాలి సరిగా లేకపోవడం వల్లే కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు. వెంటిలేషన్‌ విషయమై కార్మికులు అధికారులకు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని