logo

కాలుష్యాన్ని పసిగడతారు

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం గాలిలో సూక్ష్మ ధూళికణాల పరిమితి 40(పీఎం 10) ఉండాలి కానీ ఉమ్మడి జిల్లాలో అంతకంటే ఎక్కువే నమోదు అవుతోంది. ఒకప్పుడు పెద్ద పట్టణాలకే పరిమితమైన వాయు కాలుష్యం ఇప్పుడు జిల్లాలకు పాకుతోంది. వాహనాల సంఖ్య పెరగడం, పరిశ్రమలు ఏర్పడటంతో వేగంగా విస్తరిస్తోంది.

Published : 27 Jun 2024 02:36 IST

ఆదిలాబాద్‌లో మూడు గాలి నాణ్యత పర్యవేక్షణ  కేంద్రాలు
ఆదిలాబాద్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే

మందమర్రిలోని కాలుష్య పరిశీలన కేంద్రం

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం గాలిలో సూక్ష్మ ధూళికణాల పరిమితి 40(పీఎం 10) ఉండాలి కానీ ఉమ్మడి జిల్లాలో అంతకంటే ఎక్కువే నమోదు అవుతోంది. ఒకప్పుడు పెద్ద పట్టణాలకే పరిమితమైన వాయు కాలుష్యం ఇప్పుడు జిల్లాలకు పాకుతోంది. వాహనాల సంఖ్య పెరగడం, పరిశ్రమలు ఏర్పడటంతో వేగంగా విస్తరిస్తోంది.

గాలిలో సూక్ష్మధూళి కణాలు(పీఎం 10) నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) గణాంకాల ప్రకారం గతంతో పోలిస్తే ప్రతి నెలా పెరుగుతోంది. అయితే మరింత కచ్చితత్వం కోసం ఆదిలాబాద్‌లో మరో మూడు గాలి నాణ్యత పర్యవేక్షణ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆమోదం తెలపడంతో కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. నివాస ప్రాంతాలకు సంబంధించి రిమ్స్‌ ఆసుపత్రి ఆవరణలో, వాణిజ్య సముదాయాలకు సంబంధించి ఆదిలాబాద్‌ పురపాలక సంఘ భవనంపై ఏర్పాటు చేసేందుకు అనుమతి తీసుకున్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో ఏర్పాటు చేసే గాలి నాణ్యత స్టేషన్‌ మార్కెట్‌ ఆవరణలో ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్త స్టేషన్ల ద్వారా నాలుగు రకాల ప్రమాదకర ఉద్గారాలను లెక్కించనున్నారు. ఎస్‌వో 2, ఎన్‌వో 2, సూక్ష్మధూళి కణాలు ఉండే పీఎం 10, అతి సూక్ష్మధూళి కణాలు ఉండే పీఎం 2.5ని లెక్కించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు మందమర్రిలో మాత్రమే గాలి నాణ్యత పర్యవేక్షణ స్టేషన్‌ ఉంది. ఇక్కడ గుర్తించిన వివరాలను ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా సగటుకు లెక్కలోకి తీసుకున్నారు. తాజాగా కేంద్రం ప్రాంతాలవారీగా గాలి నాణ్యతను లెక్కించేందుకు రాష్ట్రంలో 40 స్టేషన్లు ఏర్పాటు చేయగా అందులో ఆదిలాబాద్‌ జిల్లాలో మూడు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

పక్కాగా లెక్కించడానికి దోహదం

- లక్ష్మణ ప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి రీజినల్‌ అధికారి

గాలి నాణ్యతపై ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకునేందుకు వీలుగా ఈ స్టేషన్లు ఉపయోగపడుతాయి. ప్రాంతాలవారీగా గాలి నాణ్యతను పర్యవేక్షించేందుకు జిల్లాకు మూడు కేంద్రాల ఏర్పాటుకు అనుమతి వచ్చింది. ఈ కేంద్రాల ఏర్పాటుతో ఎక్కడ ఏ రకమైన కాలుష్య ఉద్గారాలు పరిమితికి మించి ఉన్నాయి. ఏ సమయంలో కాలుష్య తీవ్రత ఎక్కువ ఉంటుంది అనే సమాచారాన్ని పక్కాగా తెలుసుకోవచ్చు. పరిమితికి మించి ఉంటే కాలుష్య నియంత్రణ కట్టడి దిశగా చర్యలకు ఈ స్టేషన్లు ఇచ్చే సమాచారం ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడుతుంది.

ఉమ్మడి జిల్లాలో సగటు సూక్ష్మధూళి కణాల విలువ ఇలా..

జనవరి 78
ఫిబ్రవరి 83
మార్చి 80
ఏప్రిల్‌ 84

  • నెల
  • సూక్ష్మధూళికణాలు (పీఎం 10)    

సూక్ష్మ ధూళికణాల పరిమితి(ఘనపు మీటరుకు మైక్రో గ్రాముల్లో)

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం  60
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 40

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని