logo

పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం : మంత్రి సీతక్క

పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

Published : 01 Jul 2024 13:06 IST

ఆదిలాబాద్ అర్బన్ : పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా మావల మండలం లోని హరితవనంలో మొక్కలు నాటారు. జిల్లాలో ఈ సంవత్సరం 44 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం ఉందని, అన్ని శాఖల అధికారులు వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.  హరితవనంలో ప్రకృతి అందాలు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం, డిఎఫ్ఓ ప్రశాంత్ పాటిల్, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని