logo

Adilabad: సేవలతోనే గుర్తింపు

ఉద్యోగులు ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తేనే వారు కలకాలం గుర్తుంచుకుంటారని జిల్లా అదనపు పాలనాధికారి శ్యామలాదేవి, డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ సూచించారు.

Published : 30 Jun 2024 20:34 IST

ఎదులాపురం: ఉద్యోగులు ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తేనే వారు కలకాలం గుర్తుంచుకుంటారని జిల్లా అదనపు పాలనాధికారి శ్యామలాదేవి, డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ సూచించారు. వైద్యశాఖలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన రాథోడ్ బాబులాల్-సుశీల దంపతులను స్థానిక విద్యుత్ తరంగిణి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన పదవీ విరమణ మహోత్సవంలో పలువురు ఘనంగా సన్మానించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వ్యవస్థాపకుడిగా బాబూలాల్ అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జెడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆర్డీఓ రమేష్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాథోడ్ జైసింగ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, అదనపు డీఎంహెచ్‌వో కుడ్మెత మనోహర్, మెడికల్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని