మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు.
హైదరాబాద్: ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్(59) కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్‌లోని తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా.. మార్గమధ్యంలో ఇచ్చోడ వద్ద తుది శ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని ఉట్నూర్‌కు తరలించారు. రమేష్ రాథోడ్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.
తెదేపా తరఫున 1999లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా రమేష్ రాథోడ్ ఎన్నికయ్యారు. 2009లో ఆ పార్టీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెదేపా నుంచి భారాసలో చేరారు. అనంతర పరిణామాల్లో కాంగ్రెస్‌లో చేరి 2019లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత భాజపాలోకి వెళ్లారు. ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు
[ 30-06-2024]
సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా పాలనాధికారి రాజర్షి షా తెలిపారు. -
బస్సు ప్రమాదంలోనే గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం
[ 30-06-2024]
ఆదిలాబాద్ ఆర్టీసి బస్ స్టాండ్ ఆవరణలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మృతి ఘటనను పోలీసులు ఛేదించారు. -
‘గుట్టుగా దుకాణాల వేలం’పై అభ్యంతరం
[ 30-06-2024]
బల్దియాలో పారదర్శకతకు పాతరేసి గుట్టుగా సాగిన అద్దె దుకాణాల వేలంపాటపై కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఛైర్మన్ జోగు ప్రేమేందర్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ‘ఈనాడు’లో ‘గుట్టుగా అద్దె దుకాణాల వేలం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై చర్చ జరిగింది. -
రమేష్ రాఠోడ్ మృతితో విషాదం
[ 30-06-2024]
మెండైన గుండె ధైర్యం. ఆప్యాయంగా పలకరించే నైజం. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలతో మమేకమయ్యే తాపత్రయం. అవసరాన్ని బట్టి తోచిన సాయం చేయాలనే మానవత్వం. భాజపా నేత, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్ (57) సొంతం. -
వేలిముద్ర వేయకున్నా.. రూ.1.40 లక్షలు మాయం!
[ 30-06-2024]
మారుమూల ప్రాంతానికి చెందిన గిరిజన మహిళా రైతు నిరక్షరాస్యురాలు. సీఎస్సీ (కస్టమర్ సర్వీస్ సెంటర్)లలో వేలిముద్ర వేసి తన ఖాతా నుంచి అవసరమైన డబ్బులు తీసుకునేవారు. -
సంప్రదాయ ఆటలో మెరికలు
[ 30-06-2024]
కబడ్డీ తర్వాత భారత ఉప ఖండంలో రెండో అత్యంత ప్రజాదరణ పొందిన సంప్రదాయ ఆట ఖోఖో.. కాలానుగుణంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్న ఈ క్రీడ ఇప్పుడు దక్షిణాసియాలో విస్తృతమైంది.. ఇలాంటి ఆటల్లో విద్యార్థులు రాణిస్తున్నారు. -
అవినీతిలో ఘనుడు
[ 30-06-2024]
పనిచేసే చేసే చోట నాలుగు రాళ్లు వెనుకేసుకోవడం, ఆస్తులు, భూములు దొడ్డిదారిన కొట్టేయడం ఆయన నైజం. భారీ భవంతులు నిర్మించడం, కోళ్లఫామ్‌లు, ఢైరీఫామ్లు స్థాపించడం, రహదారుల పక్కన ఉన్న విలువైన స్థలాలను కాజేయడం, బినామీ వ్యక్తుల పేరుతో పట్టా చేయడం వెన్నతో పెట్టిన విద్య. -
పట్టాలున్నా.. రుణం రావట్లే!
[ 30-06-2024]
అటవీ భూములు సాగు చేసుకుంటున్న అన్నదాతలకు ప్రభుత్వం హక్కు పత్రాలిచ్చినా.. పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. ఇప్పటికే పంటల సీజన్ మొదలై నెల కావాస్తోంది. ఇటు పెట్టుబడి సాయం అందక అటు బ్యాంకులు అప్పులు ఇవ్వక పోడుదారులు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. -
ముంచుకొస్తున్న ముప్పు.. కలగాలి కనువిప్పు!
[ 30-06-2024]
కాగజ్‌నగర్ బల్దియాలోని రోడ్లు, మురుగు కాలువల వ్యవస్థ అధ్వానంగా తయారయ్యాయి. చిరుజల్లులు కురిసినా.. పలు రోడ్లు చిత్తడిగా మారుతున్నాయి. రోడ్ల మరమ్మతులు లేక గుంతలమయంగా మారి వర్షపు నీరు చేరి చిన్నపాటి మడుగులను తలపిస్తున్నాయి. -
వెన్నుపూసలు కదులుతున్నాయ్!
[ 30-06-2024]
జిల్లాలోని చెన్నూరు- భీమారం మండలాల సరిహద్దులో ఉన్న జోడువాగుల ప్రాంతంలో 63వ జాతీయ రహదారి అధ్వానంగా మారింది. కిలోమీటర్ వరకు రోడ్డుపై అనేకచోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. -
బడిబాట @ 2819 ప్రవేశాలు
[ 30-06-2024]
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యాశాఖ అడుగులు వేసింది. నూతన విద్యాసంవత్సరం ఈ నెల 12వ తేదీన ప్రారంభమైనప్పటికీ ఈ నెల 6 నుంచి 19 వరకు ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపునకు జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ప్రసాదాలపై పర్యవేక్షణ శూన్యం
[ 30-06-2024]
బాసర సరస్వతి అమ్మవారి ఆలయంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే ప్రసాదాల విక్రయాల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వారందరూ ప్రసాదాలు కొనుగోలు చేస్తారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉత్కంఠ రేకెత్తించిన మ్యాచ్‌లో బెస్ట్ ఫీల్డర్ ఎవరంటే..
-
‘అమ్మ పేరుతో ఒక మొక్క’.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
-
‘పిచ్’ టేస్ట్.. రోబో వాక్.. సూపర్ ఎండింగ్.. ఫన్ మూమెంట్స్!
-
ప్రశ్నించే విద్యార్థులు, నిరుద్యోగులపై కేసులా?: హరీశ్‌రావు
-
దేశ అత్యున్నత అధికారులుగా..చిన్ననాటి స్నేహితులు
-
తితిదే ఈవో ఆగ్రహం.. అందుబాటులోకి గత పాలకమండలి తీర్మానాలు