logo

Adilabad: రిమ్స్‌లో మొదటి క్రానియోటమీ శస్త్ర చికిత్స

రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మొదటి క్రానియోటమీ శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా చేశారు.

Published : 03 Jul 2024 15:53 IST

ఎదులాపురం: రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మొదటి క్రానియోటమీ శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా చేశారు. అదిలాబాద్ పట్టణానికి చెందిన రోహన్ (25) ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించగా.. మెదడులో రక్తం గడ్డ కట్టుకపోయి తల ఎముకలు దెబ్బతిన్నట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో మొదటిసారి రిమ్స్‌లో క్రానియోటమీ శస్త్ర చికిత్స చేయగా రోగి కోల్కొవడంతో డిశ్చార్జ్ చేశారు. ప్రైవేటులో ఈ శస్త్రసికిత్సకు రూ.3 లక్షలకు పైగా ఖర్చు అయ్యేదని జైసింగ్ రాథోడ్ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని