logo

డెంగీ వ్యాధి నివారణ అవగాహన ర్యాలీ

వర్షాకాలం నేపథ్యంలో కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్‌ఓ నరేందర్ రాథోడ్ సూచించారు.

Updated : 05 Jul 2024 15:41 IST

ఎదులాపురం: వర్షాకాలం నేపథ్యంలో కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్‌ఓ నరేందర్ రాథోడ్ సూచించారు. డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్‌లోని కొలిపూరలో డెంగీ వ్యాధి నివారణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ దోమల వృద్ధి కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖమర్, అదనపు డీఎంహెచ్ఓ సాధన, జిల్లా మలేరియా నివారణ అధికారి శ్రీధర్, డివైఎస్ఓ వెంకటేశ్వర్లు, మెప్మా, వైద్య సిబ్బంది ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని