logo

Adilabad: వేరుశెనగ సంచుల దొంగలు పట్టివేత

ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీనాథ్ జిన్నింగ్ మిల్లులో గత నెల 14న వేరుశెనగ బస్తాలు, విద్యుత్ మోటార్లు, ఇతర వస్తువులను అపహరించిన దొంగలను పోలీసులు గుర్తించారు.

Published : 04 Jul 2024 19:33 IST

ఎదులాపురం: ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీనాథ్ జిన్నింగ్ మిల్లులో గత నెల 14న వేరుశెనగ బస్తాలు, విద్యుత్ మోటార్లు, ఇతర వస్తువులను అపహరించిన దొంగలను పోలీసులు గుర్తించారు. ఖుర్మిద్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ జావిద్‌, సుందరయ్యనగర్‌కు చెందిన షేక్‌ జావిద్‌, సంజయ్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ ఇర్ఫాన్‌, తబ్రేజ్‌లు పది క్వింటాళ్ల వేరుశనగ, రెండు విద్యుత్‌ మోటార్లు, ఎన్‌టీ వైరును అపహరించారు. జిన్నింగ్ మిల్లు యజమాని పిరాని అన్వార్ అలీ ఫిర్యాదు మేరకు గత నెల 18న కేసు నమోదు చేశారు.  తబ్రేజ్ పరారీలో ఉండగా, మిగతా ముగ్గురిని సీఐ అశోక్, రమేష్, నరేష్, క్రాంతి, సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో క్రైం పార్టీ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.  వారి నుంచి మూడు క్వింటాళ్ల వేరుశనగ (14 బస్తాలు), రెండు విద్యుత్ మోటార్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని