logo

Adilabad: చోరీ కేసును ఛేదించిన పోలీసులు

గత నెల 21న సినీ ఫక్కీలో ఓ నగల దుకాణంలో ముగ్గురు మహిళలు కిలో వెండి పట్టీలను అపహరించిన కేసును పోలీసులు ఛేదించారు.

Published : 01 Jul 2024 20:47 IST

ఎదులాపురం: గత నెల 21న సినీ ఫక్కీలో ఓ నగల దుకాణంలో ముగ్గురు మహిళలు కిలో వెండి పట్టీలను అపహరించిన కేసును పోలీసులు ఛేదించారు. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు మహిళలు వెండి పట్టీలు కొనుగోలు చేసేందుకు స్థానిక గణేష్ జ్యువెలరీ షాపునకు గత నెల 21న వెళ్లి వాటిని కొంటున్నట్లు నటిస్తూ కిలో వెండి పట్టీలతో పరారయ్యారు. సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌, సిబ్బంది జాకీర్‌, శ్రీనివాస్‌తో కలిసి దొంగతనానికి పాల్పడిన మహిళల్లో ఒకరిని స్థానిక రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నట్లు వన్‌టౌన్‌ ఎస్‌ఐ ఉదయ్‌కుమార్‌ తెలిపారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ దేవ్గాంకు చెందిన ఉషాబాయి (60) స్థానిక రైల్వే స్టేషన్‌లో సంచరిస్తుండగా, సీసీఎస్ సిబ్బంది, రాధ (హెచ్‌సి), పుష్ప (పీసీ)తో పాటు ఎస్‌ఐ వల పన్ని అరెస్టు చేసి ఆమె నుంచి కిలో వెండి పట్టీలను స్వాధీనం చేసుకున్నారు.  నిందితురాలిని రిమాండ్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని