logo

Adilabad: గ్రామీణ తపాలా ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి

ఇటీవల నూతనంగా చేరిన గ్రామీణ తపాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని నేషనల్ యూనియన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయిస్ జాతీయ, రాష్ట్ర, జిల్లా బాధ్యులు కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

Published : 01 Jul 2024 16:48 IST

ఆదిలాబాద్ సాంస్కృతికం: ఇటీవల నూతనంగా చేరిన గ్రామీణ తపాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని నేషనల్ యూనియన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయిస్ జాతీయ, రాష్ట్ర, జిల్లా బాధ్యులు కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన 26వ ద్వైవార్షిక సంయుక్త డివిజనల్ కాన్ఫరెన్స్ లో వారు మాట్లాడారు. తపాలా ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వివరిస్తూనే వాటి పరిష్కార మార్గాలు తెలిపారు. ఈ సమావేశంలో నేషనల్ యూనియన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయిస్ జాతీయ, రాష్ట్ర, జిల్లా బాధ్యులు వెంకటరమణ, జిల్లాలోని ఆయా ప్రాంతాల తపాల ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని