logo

Adilabad: సీపీఐ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలను సీపీఐ నాయకులు ఘనంగా నిర్వహించారు.

Published : 04 Jul 2024 15:48 IST

ఆదిలాబాద్ సాంస్కృతికం: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలను సీపీఐ నాయకులు ఘనంగా నిర్వహించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నిరంకుశ పాల‌న నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు, ఆత్మ గౌర‌వ ప‌తాక‌ను ఎగుర‌వేసేందుకు ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టిన యోధుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, నాయకులు కట్ట కృష్ణస్వామి, బెజ్జంకి నరసింగరావు, అరుణ్ కుమార్, కుంటాల రాములు, ఎస్.కె.పాషా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని