logo

Adilabad: ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేద్దాం

ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని లయన్స్ క్లబ్ కింగ్స్, కాటన్ సిటీ ఆదిలాబాద్ అధ్యక్షుడు పుప్పాల నరేందర్ పిలుపునిచ్చారు.

Published : 03 Jul 2024 18:06 IST

ఎదులాపురం: ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని లయన్స్ క్లబ్ కింగ్స్, కాటన్ సిటీ ఆదిలాబాద్ అధ్యక్షుడు పుప్పాల నరేందర్ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ వినియోగదారులకు గుడ్డ సంచులను స్థానిక రైతు బజార్‌లో క్లబ్ ఆధ్వర్యంలో పంపిణీ చేసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  కొనుగోళ్లకు వెళ్లేటప్పుడు గుడ్డ లేదా జ్యూట్ బ్యాగులను తీసుకెళ్లడం మర్చిపోవద్దని సూచించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల మనుషులకే కాకుండా జంతువులకు, పర్యావరణానికి కూడా హానికరమన్నారు.  కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు సత్యనారాయణ, బెజ్జంకి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని