logo

Adilabad: అంగన్వాడీలకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలి

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు అంగన్వాడీలకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.జయలక్ష్మి డిమాండ్ చేశారు.

Updated : 02 Jul 2024 16:37 IST

ఎదులాపురం: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు అంగన్వాడీలకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.జయలక్ష్మి డిమాండ్ చేశారు. మంగళవారం అదిలాబాద్ పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ అంగన్వాడీలకు పెన్షన్ తక్కువ ఇచ్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్వాడీల రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు బొజ్జ ఆశన్న, అన్నమోల్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని