logo

ఓసిటీ మైదానంలో మరో వాగ్వాదం

వరంగల్‌ జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి సంస్థకు చెందిన ఓసిటీ మైదానంలో మంగళవారం మరోసారి వాగ్వాదం జరిగింది.

Published : 19 Jun 2024 02:30 IST

వరంగల్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: వరంగల్‌ జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి సంస్థకు చెందిన ఓసిటీ మైదానంలో మంగళవారం మరోసారి వాగ్వాదం జరిగింది. కొద్ది రోజులుగా మైదానంలో పలువురు యువకులు క్రికెట్‌ ఆడుతుండటంతో వాకర్స్, ఉచిత శిబిరానికి వచ్చే చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం వాకింగ్‌ చేస్తున్న ఓ మహిళకు క్రికెట్‌ బంతి తగలడంతో కుప్పకూలిపోయారు. దీంతో క్రికెట్‌ ఆడే యువకులు, వాకర్స్‌ మధ్య వాగ్వాదం జరిగింది. గత నెలలో కొద్దిమంది బయటి యువకులు క్రికెట్‌ ఆడటంతో డీఎస్‌ఏ(డిస్ట్రిక్ట్‌ స్పోర్ట్స్‌ అథారిటీ) ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న పదో తరగతి విద్యార్థికి బంతి తగిలింది. ఆ సమయంలో చిన్నారుల తల్లిదండ్రులు జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి సత్యవాణికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె సదరు యువకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొద్దిరోజులు యువకులు అటువైపు రాలేదు. మళ్లీ మంగళవారం వచ్చిన యువకులు క్రికెట్ ఆడి ఓ మహిళను గాయపర్చారు.

ప్రభుత్వ మైదానంలో తరచూ జరుగుతున్న గొడవలపై క్రీడల అధికారి సత్యవాణిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. వివాదాలు జరిగినప్పుడు ఫిర్యాదు చేసి ఆ తర్వాత ఇరువర్గాల వారు సర్దుకుపోతున్నారన్నారు. దీంతో ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నామని ఆమె పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని